• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టులో ఉంది ... కాంగ్రెస్‌ను ఎలా విలీనం చేస్తారు... ఉత్తమ్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు ఆందోళనబాట పట్టారు. ఈనేపథ్యంలోనే ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోపాటు మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీలు అసెంబ్లీలోని అంబేద్కర్,గాంధీ విగ్రహల ముందు ధర్నాకు నిరసనకు దిగారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించండి

ప్రజాస్వామ్యాన్ని రక్షించండి

ఈనేపథ్యంలోనే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ వారు నినాదాలు చేశారు. అయితే అసెంబ్లీ అవరణలో ఉన్న గాంధీ అంబేద్కర్ విగ్రహాల ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్దమయ్యారు. కాని అసెంబ్లీ సెక్యూరిటి సిబ్బంది అనుమతిని ఇవ్వకపోవడంతో అసెంబ్లీ ముందు నల్ల రిబ్బన్లు ధరించి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసంధర్బంగా సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రతిపక్షం లేకుండా చేస్తున్న కేసీఆర్ అసెంబ్లీని కూడ తన ఫామ్ హౌజ్'లో నడుపుకోవాలని ఆయన మండిపడ్డారు.

స్పికర్ తీరుపై మండిపడ్డ ఉత్తమ్

స్పికర్ తీరుపై మండిపడ్డ ఉత్తమ్

ఇక ఈనేపథ్యంలోనే స్పికర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకోసం స్పికర్‌తో మాట్లేడేందుకు ఫోన్లో ప్రయత్నాలు చేశారు. స్పికర్ ఇంటితో పాటు కార్యాలయానికి ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు.దీంతో స్పికర్ స్పందించే వరకు తమ అందోళన కొనసాగుతుందని పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కాగా తమతో మాట్లాడేందుకు అందుబాటులోకి రాని స్పికర్ రహస్యంగా మాత్రం ఎమ్మెల్యేలను కలిశాడని ఉత్తమ్ మండిపడ్డారు.

 కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్

కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్


కాగా స్పికర్‌కు పార్టీని విలీనం చేసే అధికారం లేదని ఉత్తమ్ అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతుందని అలాంటీ సందర్భంలో స్పికర్ వీలీన ప్ర్రక్రియను ఎలా చేపడతాడని ఆయన ప్రశ్నించారు. కాగా ఇదివరకే టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టును అశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. కోర్టు మాత్రం ఆకేసును పెండింగ్‌లో పెట్టింది. అనర్హత పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చి చేప్పింది.

ఆరుకు చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య

ఆరుకు చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో టీఆర్ఎస్‌లో చేరిన వారి సంఖ్య 12కు చేరింది. దీంతో మూడింటిలో రెండువంతుల మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు స్పికర్‌కు లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన బాట పట్టారు. కాగా పందోమ్మిది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ బలం అసెంబ్లీలో ప్రస్థుతానికి ఆరుకు చేరింది. మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో , భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పోదేం వీరయ్య, కొమటిరెడ్డి రాజగోపాల రెడ్డితోపాటు జగ్గారెడ్డలు ఉన్నారు.

జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారు

జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారు

అయితే ఇదివరకే వీలీనానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలో వీలీనం చేయడం రాజ్యంగ విరుద్దమని వారు వాదిస్తున్నారు. వీలీనం పై జాతీయ కాంగ్రెస్ లేఖ ఇవ్వకుండా సాంకేతికంగా చెల్లదని వారు చెబుతున్నారు. కాని ఇదివరకే శాసన మండలిలో కూడ కాంగ్రెస్ పార్టీ మెజారీటి ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో విలీనం అవుతున్నామని మండలి చైర్మణ్‌కు లేఖ ఇవ్వడంతో మండలీలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ కూడ చేశారు. ప్రస్థుతం దీనిపై కూడ అదే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

English summary
congress legislature party leader Bhatti Vikramarka,and former minister Manthani MLA Sridhar Babu along with party cader protest dharna for save democracy sitting in front of gahandi and ambrdker statue.before that Congress party MLAs who joined in the TRS gave the letter to the Speaker Picharam Srinivasa Reddy for merge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X