వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీలను విలీనం చేసే అధికారం స్పికర్‌కు లేదు... ఎంపీ రేవంత్ రెడ్డి,

|
Google Oneindia TeluguNews

పార్టీలను విలీనం చేసే అధికారం శాసన సభ స్పికర్లకు లేదని మల్కజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇది స్పికర్ పరిధిలోకి రాదని తెలిపారు. కాగా పార్టీల విలీన ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రధాన అధికారి మాత్రమే చేపట్టగలడని చెప్పాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి టీఆర్ఎస్‌లో విలీనానికి ఒత్తిడి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక స్పికర్‌కు సభ నిర్వాహణతోపాటు పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపి వారిపై అనర్హత వేటు వేసే అధికారం మాత్రమే స్పికర్‌కు ఉంటుందని అన్నారు.

ఇక ఇలాంటీ ప్రక్రియనే 2016 సంవత్సరంలో ,టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను విలీనం చేస్తూ బులెటిన్ విడుదల చేశారని , అయితే స్పికర్ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఈనేపధ్యంలోనే ఇప్పుడు అసెంబ్లీ జారీ చేసిన బులెటిన్ చెల్లదని అన్నారు. కాగా అనర్హత పిటిషన్లను మూడు నెలల్లో విచారించాలని హైకోర్టు ఇచ్చిన డైరక్షన్‌ను కూడ స్పికర్ ఉల్లంఘిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

speaker has no power to merge the parties :says Revanth reddy

గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నేండు మంది ఎమ్మెల్యేలు తాము షెడ్యుల్ 10 ప్రకారమే కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ఏకవ్యాఖ్య తీర్మాణం చేస్తూ స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ అందించారు. దీంతో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తూ... స్పికర్ ఆదేశాలతో శాసన సభ సెక్రటరీ నర్సింహాచార్యులు సాయంత్రమే బులెటిన్ సైతం విడుదల చేశారు.

English summary
the speaker has no power to merge the parties in other party said mp revanth reddy in hyderabad. it has only central election commission he cleared.revanth reddy speaks about the merge bulletin of congress party mla's in trs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X