ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశ్వ బ్రాహ్మణులపై వేధింపులుండవు: స్పీకర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం జనవరి 2న హైదరబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.

వడ్రంగి వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారికి అటవీశాఖ అధికారుల వేధింపులున్నాయని, ఈ విషయమై అటవీశాఖ మంత్రి జోగు రామన్న జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. విశ్వబ్రాహ్మణులపై పోలీసుల దాడుల నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలను పరిశీలించి, వేధింపులు లేకుండా చూస్తామన్నారు.

తనకు స్పీకర్‌ పదవి ఇవ్వడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశ్వబ్రాహ్మణులకు పెద్దపీట వేసినట్లైందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌, పార్లమెంటు కార్యదర్శి కోవ లక్ష్మీ, ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

అధికారిక వందనం

అధికారిక వందనం

విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి అన్నారు.

మధుసూదనాచారి

మధుసూదనాచారి

బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు.

మధుసూదనాచారి

మధుసూదనాచారి

ఈ సందర్బంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం జనవరి 2న హైదరబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.

మంత్రి జోగు రామన్న

మంత్రి జోగు రామన్న

వడ్రంగి వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారికి అటవీశాఖ అధికారుల వేధింపులున్నాయని, ఈ విషయమై అటవీశాఖ మంత్రి జోగు రామన్న జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఎంపి బాల్క సుమన్

ఎంపి బాల్క సుమన్

విశ్వబ్రాహ్మణులపై పోలీసుల దాడుల నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలను పరిశీలించి, వేధింపులు లేకుండా చూస్తామన్నారు.

మధుసూదనాచారి

మధుసూదనాచారి

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతులపై అధ్యాయనం చేస్తున్నందున అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుందని మధుసూదనాచారి ఆశాభావం వ్యక్తం చేశారు.

మధుసూదనాచారి

మధుసూదనాచారి

మనిషి ధైనందిన జీవితంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర ఎంతో ఉందని, రాబోయే కాలంలో విశ్వబ్రాహ్మణులకు సమస్యలు లేని జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మధుసూదనాచారి

మధుసూదనాచారి

తనకు స్పీకర్‌ పదవి ఇవ్వడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశ్వబ్రాహ్మణులకు పెద్దపీట వేసినట్లైందని అన్నారు.

English summary
Telangana Speaker Madhusadhana chary visited Mancherial on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X