వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: అతిపెద్ద కరోనా ఆస్పత్రి, 13 అంతస్తులతో నిర్మాణం, వచ్చేవారం అందుబాటులోకి...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో గచ్చిబౌలిలో ప్రత్యేక హాస్పిటల్ కూడా నిర్మిస్తోంది. దేశంలో అతిపెద్ద ఆస్పత్రిగా పేరుగాడించనున్న గచ్చిబౌలి దవాఖాన.. మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఆస్పత్రిలో ఉన్న విశేషాలపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.

తెలంగాణలో కూడా..

తెలంగాణలో కూడా..

కరోనా వైరస్ ఆవిర్భవించిన చైనాలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు 10 రోజుల్లో ఆస్పత్రి నిర్మించగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజీ‌లో 9 ఎకరాల ప్రాంగణంలో ఆధునాతన సదుపాయాలు కల్పించబోతున్నారు. 13 అంతస్తులతో ఆస్పత్రి భవనం ఉండనుండగా... ప్రతీ ప్లోర్‌లో 36 గదులను ఏర్పాటు చేశారు. మొత్తం 468 గదులు ఉండగా 1200 నుంచి 1500 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పడకకు కనీసం ఆరు మీటర్ల దూరం ఉండేట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ బెడ్‌కు టేబుల్, చెయిర్, లాకర్ సదుపాయం ఉంటుంది.

13 అంతస్తులు..

13 అంతస్తులు..

13 అంతస్తుల్లో వైరస్ సోకిన వారికి ఒక అోంతస్తు, వైరస్ వచ్చిన వారికి మరొ అంతస్తు, రోగులతో ఉండే బంధువులు, వైద్యులు, నర్సులకు ప్రత్యేక గదులు ఉంటాయని తెలంగాణ వైద్యశాఖ అధికారులు తెలిపారు. రోగులను పరీక్షించేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే 77 మంది వైద్యులు 102 మంది స్టాఫ్ నర్సులను తీసుకున్నామని.. మిగిలినవారిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తామని అధికారులు తెలిపారు.

 కోవిడ్ 19 ఆస్పత్రి

కోవిడ్ 19 ఆస్పత్రి

ఆస్పత్రిలో అన్ని పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి పరిధిలో పనిచేసే ఆస్పత్రి.. ప్రభుత్వం కోవిడ్ 19 హాస్పిటల్ అని పేరు పెట్టిందని చెప్పారు. ఆస్పత్రి మొత్తం ఐసోలేషన్ సెంటర్ అని నోడల్ అధికారి డాక్టర్ నాగేందర్ తెలిపారు.

15వ తేదీ లోపు..

15వ తేదీ లోపు..

ప్రస్తుతం రాష్ట్రంలో గాంధీ, చెస్ట్, ఫీవర్ దవాఖానాల్లో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందజేస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ కోఠి, సరోజిని దేవి కంటి ఆస్పత్రుల్లో కరోనా వైరస్ రోగులకు కూడా సేవలను అందజేస్తున్నారు. వైరస్ కేసులు పెరగడంతో మరొ ఆస్పత్రి అవసరం అని ప్రభుత్వం భావించి.. గచ్చిబౌలిలో ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పరిశీలించారు. వీలైనంత త్వరంగా పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఈ నెల 15 లోపు ఆస్పత్రి నిర్మాణం పూర్తికాబోతున్నట్టు తెలుస్తోంది.

Recommended Video

Lockdown Extension: Hyderabd Public Reaction On Modi Decision | Oneindia Telugu

English summary
new hospital is being established at the Gachibowli Sports Village in Hyderabad with about 1,200 to 1,500 beds; due to be started within a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X