హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక గురి తప్పదు: చైన్ స్నాచర్ల కోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గొలుసు దొంగలను పట్టుకునే క్రమంలో దాడికి దిగితే చైన్ స్నాచర్లపై కాల్పులు జరిపేందుకు వెనుకాడేది లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. యాంటీ స్నాచింగ్ టీమ్ శిక్షణ మొదటి దశ పూరె్తైన సందర్భంగా బుధవారం ఛేజ్‌కామ్‌ల పనితీరును సైబరాబాద్ కమిషనరేట్‌లో పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు తాము పంచతంత్ర విధానాన్ని అవలంభిస్తున్నట్టు చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గొలుసు దొంగల సమస్య తీవ్రమైందన్నారు. ప్రజల్లో భయాందోళనను తొలగించి ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

చైన్ స్నాచింగ్‌ల నివారణకు యాంటీ స్నాచింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. జోనల్ టాస్క్ఫోర్సులో పనిచేస్తున్న మెరికల్లాంటి యువకులతో బృందాన్ని ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవడంలో మెళకువలు, వేగంగా మోటారు సైకిల్‌ను నడపడం, ఫైరింగ్‌పై శిక్షణ ఇచ్చినట్టు సిపి వెల్లడించారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ఐదు మార్గాలను ఎంచుకున్నట్టు తెలిపారు. ఛేజ్ అండ్ క్యాబ్ బృందాలు, అంతర్రాష్ట ముఠాలను పట్టుకునేందుకు 7 బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు ఏయే ప్రాంతంలో నేరాలకు పాల్పడిన ఇతర రాష్ట్ర నేరగాళ్లను పట్టుకుంటాయని తెలిపారు.

స్థానికంగా ఉండే గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు నేరస్థులను గాలిస్తాయన్నారు. మరికొన్ని బృందాలు క్లూలు సేకరిస్తుందని తెలిపారు. స్నాచర్లు వివిధ నేరాలకు పాల్పడే నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టడంతోపాటు నేరస్థుల ఫోటోలను యాప్‌ద్వారా డేటాబేస్‌లో అప్‌గ్రేడ్ చేస్తామని, ఈ నేరస్థుల ఫోటోలు యాంటీ బృందాలతోపాటు పోలీసు స్టేషన్‌లలోను, వారికిచ్చిన ఫోన్‌లో వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వాహనాల తనిఖీలతోపాటు గొలుసు దొంగతనాలపట్ల మహిళలలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్టు సిపి సివి ఆనంద్ వెల్లడించారు. వనస్థలిపురంలో స్నాచింగ్‌కు పాల్పడింది స్థానిక ముఠాల పనేనని చెప్పారు.

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

గొలుసు దొంగలను పట్టుకునే క్రమంలో దాడికి దిగితే చైన్ స్నాచర్లపై కాల్పులు జరిపేందుకు వెనుకాడేది లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు.

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

యాంటీ స్నాచింగ్ టీమ్ శిక్షణ మొదటి దశ పూరె్తైన సందర్భంగా బుధవారం ఛేజ్‌కామ్‌ల పనితీరును సైబరాబాద్ కమిషనరేట్‌లో పరిశీలించారు.

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు తాము పంచతంత్ర విధానాన్ని అవలంభిస్తున్నట్టు చెప్పారు.

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

దేశంలోని ప్రధాన నగరాల్లో గొలుసు దొంగల సమస్య తీవ్రమైందన్నారు. ప్రజల్లో భయాందోళనను తొలగించి ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

చైన్ స్నాచింగ్‌ల నివారణకు యాంటీ స్నాచింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

జోనల్ టాస్క్ఫోర్సులో పనిచేస్తున్న మెరికల్లాంటి యువకులతో బృందాన్ని ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవడంలో మెళకువలు, వేగంగా మోటారు సైకిల్‌ను నడపడం, ఫైరింగ్‌పై శిక్షణ ఇచ్చినట్టు సిపి వెల్లడించారు.

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ఐదు మార్గాలను ఎంచుకున్నట్టు తెలిపారు.

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

ఛేజ్ అండ్ క్యాబ్ బృందాలు, అంతర్రాష్ట ముఠాలను పట్టుకునేందుకు 7 బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు ఏయే ప్రాంతంలో నేరాలకు పాల్పడిన ఇతర రాష్ట్ర నేరగాళ్లను పట్టుకుంటాయని తెలిపారు.

యాంటీ చైన్ స్నాచింగ్ బృందాలకు తాము ఎలాంటి వాహనాలు ఇవ్వలేదని, సిబ్బందివద్ద ఉన్న హైస్పీడ్ వాహనాలనే ఉపయోగిస్తున్నామన్నారు. వారికి పెట్రోల్ వంటి సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజులలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గొలుసు దొంగలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పోలీసులు భరతం పడతారని ఘాటుగా హెచ్చరించారు.

ఈ సందర్భంగా యాంటీ స్నాచింగ్ బృందాలు హైస్పీడు మోటారు సైకిళ్లపై చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మొదటిదశ శిక్షణ పూర్తయిందని, ఈ బృందాలకు రెండో ఫేజ్ శిక్షణ ఉంటుందని సిపి వెల్లడించారు. ఈ సందర్భంగా మోటారు సైకిల్ నడవడం, నిందితులను పట్టుకోవడంతోపాటు ఫైరింగ్ విధానాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో క్రైం డిసిపి నవీన్‌కుమార్, యాంటిస్నాచింగ్ టీమ్ ఇన్‌చార్జి, అడిషనల్ డిసిపి శ్రీనివాస్‌రెడ్డితోపాటు క్రైం విభాగం అధికారులు పాల్గొన్నారు.

English summary
“Our men will be on the job round the clock to tackle chain snatchers and other criminals,” said Cyberabad police commissioner C.V. Anand on Wednesday during a skill demonstration programme of the newly constituted anti-chain snatching teams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X