• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చార్మీ, ముమైత్ ట్రెయిన్ అయి వచ్చారా?: వ్యూహం మార్చిన సిట్ అధికారులు

|

హైదరాబాద్: డ్రగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న చార్మి, ముమైత్ ఖాన్‌లు ఎవరో ట్రెయినింగ్ ఇచ్చినట్లుగా సమాధానాలు చెప్పారని తెలుస్తోంది. వారు ముందుగానే ఎవరినో సంప్రదించినట్లుగా కనిపిస్తోందని సిట్ భావిస్తోంది.

చదవండి: రవితేజ చుట్టు ఉచ్చు?: డ్రగ్ ముఠాతో పరిచయం ఎలా.. విస్తుపోయే అంశాలు?

నలుగురు మహిళలతో కూడిన సిట్ బృందం బుధవారం చార్మిని, గురువారం ముమైత్ ఖాన్‌ను ప్రశ్నించింది. వారి కోసం ఎన్నో ప్రశ్నలు సిట్ బృందం సిద్ధం చేసుకుంది. కానీ వారి సమాధానాల్లో తేడా కనిపించడంతో సిట్ నివ్వెరపోయిందని సమాచారం.

వ్యూహం మార్చి ప్రశ్నించిన అధికారులు

వ్యూహం మార్చి ప్రశ్నించిన అధికారులు

చార్మి, ముమైత్ ఖాన్‌లు ఇదివరకు విచారణకు హాజరైన వారిని వివరాలు అడిగి, అందుకు అనుగుణంగా ప్రిపేర్ అయి ఉంటారని భావిస్తున్నారు. వారు ట్రెయినింగ్ తీసుకొని వచ్చినట్లుగా కనిపిస్తోందని భావిస్తున్నారు. దీంతో సిట్ బృందం వ్యూహం మార్చి వారిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసిందని సమాచారం.

  Ravi Teja Skipped His Brother Bharat's Funeral? Find out the Facts | Filmibeat Telugu
  అందరి సమాధానాలను పరిశీలించేందుకు ఓ బృందం

  అందరి సమాధానాలను పరిశీలించేందుకు ఓ బృందం

  సిట్ గురువారం వరకు ఏడుగురిని విచారించింది. పూరీ నుంచి ముమైత్ ఖాన్ వరకు అందరు చెప్పిన సమాధానాలను, అలాగే ఒకరు చెప్పన సమాధానాలకు మరొకరి సమాధానంతో ఏమైనా పొంతన ఉందా.. తదితర అంశాలను ప్రత్యేకంగా ఓ బృందం పరిశీలిస్తోంది. అంతేకాదు, ఈ రోజు వరకు విచారణలో వెల్లడైన అంశాలకు అనుగుణంగా రేపు విచారించే వారి కోసం ప్రశ్నలు తయారు చేస్తున్నారు.

  కీలక సాక్షులుగా

  కీలక సాక్షులుగా

  చార్మి, ముమైత్ ఖాన్‌లను కీలక సాక్షులుగా సిట్ బృందం పరిగణిస్తోందని తెలుస్తోంది. వారు సూటిగా నోరు విప్పితే చాలా విషయాలు బయటపడతాయని సిట్ అభిప్రాయపడుతోంది. అదే సమయంలో వీరు సాక్షులేనా లేదా నిందితులా అనే కోణంలోను పరిశీలిస్తోంది.

  ఆ నలుగురి సంబంధాలపై

  ఆ నలుగురి సంబంధాలపై

  చార్మీ, పూరీ జగన్నాథ్, ముమైత్ ఖాన్, కెల్విన్ మధ్య సంబంధాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారని తెలుస్తోంది. విచారణలోను దీనిని ప్రధానంగా చేసుకున్నారని సమాచారం.

  ముమైత్ ఖాన్‌పై ప్రశ్నల వర్షం

  ముమైత్ ఖాన్‌పై ప్రశ్నల వర్షం

  ముమైత్ ఖాన్‌పై సిట్ అధికారులు ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లారు? పబ్బులకు వెళ్లే అలవాటు ఉందా? నెలకోసారి గోవా ఫెస్ట్‌లో ఏం తీసుకునేవారు? కెల్విన్ గ్యాంగ్‌తో పరిచయం ఎలా? పోకిరీ సినిమాతోనే పూరి క్లోజ్ అయ్యారా? పూరీ-చార్మీలతో ఎప్పటి నుంచి పరిచయం? మీరు అమ్మకాలు జరిపారు, తీసుకున్నారా? తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? ఖాళీ సమయాల్లో, వారాంతాల్లో ఏం చేస్తారు? మీ ద్వారానేన టాలీవుడ్‌కు డ్రగ్ సప్లయ్‌దారులు పరిచయమయ్యారా? ఎక్కువగా ఐటం సాంగ్స్ చేసే మీరు చిత్ర యూనిట్‌తో విదేశాలకు ఎందుకు వెళ్లేవారు? తదితర ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Actress Mumaith Khan, who is among a dozen top actors being investigated in a massive drug racket, appeared before the special investigation team (SIT) of Telangana Prohibition and Excise Department in Hyderabad which is probing the case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more