వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాజీపూర్ సైకో కిల్లర్ కేసులో విచారణ వేగం, కీలక సాక్ష్యాల సేకరణ.. తీర్పు కోసం ప్రజల నిరీక్షణ

|
Google Oneindia TeluguNews

హాజీపూర్ ఈ పేరు గుర్తు రాగానే అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు చేసి ఆపై హత్య చేసిన ఉదంతాలు గుర్తుకొస్తాయి. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి , అతను చేసిన ఘాతుకాలు ప్రతి ఒక్కరికి రక్తం మరిగేలా చేస్తాయి. వరుస హత్యలతో భయోత్పాతం సృష్టించిన హాజీపూర్‌ హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసుల విచారణ వేగంగా సాగుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి త్వరగా తీర్పు వచ్చేలా చెయ్యాలనే సంకల్పంతో న్యాయ వ్యవస్థ ఉంది.

<strong>కన్నతండ్రే కాలయముడయ్యాడు .. నాలుగేళ్ల కొడుకుని కర్కశంగా కొరికి , గొంతు నులిమి చంపేశాడు</strong>కన్నతండ్రే కాలయముడయ్యాడు .. నాలుగేళ్ల కొడుకుని కర్కశంగా కొరికి , గొంతు నులిమి చంపేశాడు

హాజీపూర్ సైకో కిల్లర్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు

హాజీపూర్ సైకో కిల్లర్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు

అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారంచేసి ఆపై హత్య చేశాడు సైకో కిల్లర్ హాజీపూర్ శ్రీనివాస్‌‌‌రెడ్డి. సైకో శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తన నేర చరితపై లోతుగా విచారిస్తున్నారు. ఇక పోలీసులకు సైతం కళ్ళు బైర్లు గమ్మే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా విచారణలో మామిడి తోటల్లో పని చూపిస్తానని వరంగల్‌ నుంచి ఓ జంటను శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే గత కొంత కాలంగా లిఫ్ట్‌ మెకానిక్‌ పనిలో సాయం తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఆ తరువాతి నుంచి ఆ దంపతులు కనిపించలేదని పోలీసులకు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ మిస్సింగ్ వ్యవహారంలోనూ కస్టడీలో ఉన్న శ్రీనివాసరెడ్డి నుంచి కూడా కీలక సమాచారం రాబడుతున్నట్లు సమాచారం.

కీలక ఆధారాల్ని సేకరించిన పోలీసులు .. 300 మంది సాక్షుల విచారణ .. ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం

కీలక ఆధారాల్ని సేకరించిన పోలీసులు .. 300 మంది సాక్షుల విచారణ .. ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం

ఇక ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు సైకో శ్రీనివాస్ రెడ్డి ఫోన్‌లో మొత్తం అశ్లీల వెబ్‌సైట్ల సెర్చింగ్‌లే ఎక్కువ ఉన్నట్టు గుర్తించారు. ఇక ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం, హత్యల కేసులో ఇప్పటి వరకు పోలీసులు 300 మంది సాక్షులను విచారించారు. ఈ సాక్ష్యాలన్నింటినీ కోర్టుకు పోలీసులు అందించారు. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారం చేసి, వారిని కిరాతంగా చంపిన కేసుల్లో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సంపాదించారు. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను పోలీసులు గుర్తించారు. మరోవైపు మృత దేహాలపై ఉన్న రక్తపు మరకలు కూడా శ్రీనివాస్ రెడ్డివేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఇక ఈ కేసును కూడా త్వరగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించనున్నట్టు తెలుస్తుంది.

 ఉరి శిక్ష వెయ్యాలని డిమాండ్ .. చంపెయ్యమని చెప్పిన సైకో శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు

ఉరి శిక్ష వెయ్యాలని డిమాండ్ .. చంపెయ్యమని చెప్పిన సైకో శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు

నరరూప రాక్షసుడు మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టిన దుర్మార్గుడు అయిన శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష వెయ్యాలని గ్రామస్తులే కాదు రాష్ట్రం మొత్తం డిమాండ్ చేసింది. మామూలుగా అందరి మధ్య తిరుగుతున్న మానవ మృగానికి మరణ దండనే సరైంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అటు హాజీపూర్ గ్రామస్తులే కాదు ఆ శాడిస్ట్ ను కన్నతల్లిదండ్రులు సైతం ఉరి శిక్ష వెయ్యాలని కోరిన విషయం తెలిసిందే . ఈ ఘటనలు వెలుగులోకి వచ్చి మూడునెలలు దాటింది .. త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష అమలు చెయ్యాలని కోరుతున్నారు హాజీపూర్ గ్రామస్తులు .

English summary
The police have gained key evidence in cases where Srinivas Reddy raped and brutally murdered three students. Police have found Srinivas Reddy's cell phone signals at the scene of the murder. Forensic experts, on the other hand, have confirmed that Srinivas Reddy is also the blood stain on dead bodies. The fast track court is expected to hear the case soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X