• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sputnik V రేటును ఫిక్స్ చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్: 5% జీఎస్టీ ఎక్స్‌ట్రా

|

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మూడోదశ వ్యాక్సినేషన్ చేపట్టినా అది అరకొరగానే కొనసాగుతోంది.. టీకాల కొరత వల్ల. భారత డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఈ రెండింటేనే రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. ఇందులోనూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ వాటా అధికంగా ఉంటోంది. ఇదే జాబితాలో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ చేరబోతోంది. వచ్చే వారం నుంచి ఈ టీకా అందుబాటులోకి రానుంది.

  5% GST: Sputnik V Vaccine ప్రాణాలు నిలిపే వ్యాక్సిన్‌పై కూడా... Price ₹ 948 + GST

  ఎవర్ గ్రీన్ కాంబో: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ, రోజాఎవర్ గ్రీన్ కాంబో: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ, రోజా

   స్పుత్నిక్ వీ రేటు ఫిక్స్

  స్పుత్నిక్ వీ రేటు ఫిక్స్

  స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రేటు ఎంత అనే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తెరదించింది. వ్యాక్సిన్ డోసు రేటును నిర్ధారించింది. దీనిపై కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్, కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్.. వాటి రేట్లతో పోల్చుకుంటే.. దీని ధరా అదే రేంజ్‌లో ఉంటోంది. పైగా దీనిపై అయిదు శాతం మేర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని అధికంగా మోపింది.

  డోసుకు ఎంతంటే..?

  డోసుకు ఎంతంటే..?

  స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ధరను రూ.995.40 పైసలుగా నిర్ధారించింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ. డోసు ఒక్కింటికి రూ.995.40 పైసలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నిజానికి- డోసు ఒక్కింటికి 948 రూపాయలతో దిగుమతి చేసుకుంటున్నామని రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. దీనిపై అదనంగా అయిదు శాతం మేర జీఎస్టీని చెల్లించాల్సి రావడంతో దీని ధర రూ.995.40 పైసలకు చేరినట్లు వివరించింది. మున్ముందు ఈ రేటు తగ్గే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్ తొలి డోసు కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

   91 శాతం ఎఫీషియన్సీ..

  91 శాతం ఎఫీషియన్సీ..

  స్పుత్నిక్ వీ వ్యాక్సిన్.. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిపై 91 శాతం విజయవంతమైనట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రష్యన్ డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ సహకారంతో ఆర్డీఎఫ్ఐ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని తయారు చేయడానికి అవసరమైన కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పొందింది. దీనిపై గత ఏడాదే ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం సైతం కుదిరింది.

   1వ తేదీ నాడే ఫస్ట్ బ్యాచ్ హైదరాబాద్‌కు..

  1వ తేదీ నాడే ఫస్ట్ బ్యాచ్ హైదరాబాద్‌కు..

  స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఫస్ట్‌బ్యాచ్ ఈ నెల 1వ తేదీ నాడే హైదరాబాద్‌కు చేరింది. ఫస్ట్ షిప్‌మెంట్‌ను రెడ్డీస్ ల్యాబ్స్ యాజమాన్యం అందుకుంది. ఫస్ట్ షిప్‌మెంట్ కింద ఈ నెల చివరివారం లేదా జూన్ మొదటి వారం నాటికి మరో 3,00,000 డోసులు అందుతాయని చెబుతున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగానికి డీసీజీఐ కిందటి నెల 13వ తేదీన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మనదేశంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. గామ్-కోవిడ్-వ్యాక్ కంబైన్డ్ వ్యాక్సిన్ వెక్టార్ ఇది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఉంది.

  English summary
  As India faces an acute shortage of COVID-19 vaccines, the first consignment of Russian Sputnik V vaccine doses will arrive on May 1 (Saturday). Notably, the first batch of the Russian vaccine doses is arriving on a day when India.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X