వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా?: శ్రవణ్, యూటీ అంటే ఇబ్బందులేనన్న విష్ణు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టం సాధించుకున్నది పెట్టుబడిదారీ విద్యావ్యవస్థను ప్రోత్సహించేందుకా? అని కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. సేవ్‌మెరిట్‌ సొసైటీ ఆధ్యర్యంలో ఎంబిబిఎస్‌ ఎడ్యుకేషన్‌పై హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఎమ్మెల్యే సంపత్‌, కాంగ్రెస్‌ నేత శ్రవణ్‌ హాజరై మాట్లాడారు.

ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నది పెట్టుబడిదారీ విద్యావ్యవస్థను ప్రోత్సహించేందుకు కాదని శ్రావణ్‌ అన్నారు. 1750 మెడికల్‌ సీట్ల భర్తీలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే సంపత్ ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా 134 కాలేజీల్లో రెన్యువల్స్‌ ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. విద్యాసంవత్సరం ముగియకముందే విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంపత్‌ ఆరోపించారు.

Sravan kumar takes on Telangana government

పేదలకు ఇళ్లు కట్టివ్వాలి: విష్ణువర్ధన్‌రెడ్డి

హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోల లీజులను రద్దుచేసి ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఖైరతాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన హమాలీల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు.

సెక్షన్‌-8పై గందరగోళం కొనసాగుతోందన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. సెక్షన్‌-8పై టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, ప్రజలకు స్పష్టత ఉందని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

English summary
Congress leader Sravan Kumar takes on Telangana government for education system in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X