వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వెనుక ఏదైనా రాజకీయ శక్తి ఉందా?: 'త్వరలో పవన్ కళ్యాణ్ మీ పని పడతాడు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నటి శ్రీరెడ్డి సహా పలువురు నటీమణులు విమర్శలు చేయడం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయా? అంటే అవుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మెగా సోదరుడు నాగబాబు. ఇటీవల కాస్టింగ్ కౌచ్ పరిశ్రమను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కొందరు... పవన్ కళ్యాణ్, జీవిత రాజశేఖర్ వంటి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు.

దీనిపై జీవితా రాజశేఖర్ మంగళవారం మీడియా ముందుకు వచ్చి గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, వ్యక్తిగతంగా నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక, వ్యక్తిగత ఆరోపణలను పవన్ పట్టించుకోరు. కానీ ఆయన చిన్న అన్నయ్య నాగబాబు మాత్రం ఆవేదనకు లోనయ్యారు. 'మా' పైన, పవన్ పైన చేసిన విమర్శలకు ధీటుగా స్పందించారు. శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తిత్వాన్ని చంపే సన్నాసులు, వెధవలు

వ్యక్తిత్వాన్ని చంపే సన్నాసులు, వెధవలు

ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేతకాకుంటే వాడి వ్యక్తిత్వాన్ని చంపేయాలని చూస్తున్నారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందన్నారు. వ్యక్తిత్వాన్ని చంపే సన్నాసులు, వెదవలు ఉన్నారని మండిపడ్డారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలన్నారు.

 పవన్ మీరు అనుకున్నంత ఇది కాదు

పవన్ మీరు అనుకున్నంత ఇది కాదు

పవన్ కళ్యాణ్ మీరు అనుకున్నంత ఇది కాదని నాగబాబు చెప్పారు. కళ్యాణ్ బాబు కనుక తప్పు చేస్తే ప్రజల ముందుకు వచ్చి బహిరంగంగా అందరి ముందు నిలబడి తాను తప్పు చేశానని చెబుతాడని అంగీకరిస్తాడని అన్నారు. ఈ తప్పు నేను చేశానని చెబుతాడన్నారు. అలాంటి దమ్మున్న మగాడు నా తమ్ముడు అని వ్యాఖ్యానించారు. మీకు ఆ దమ్ముందా అని నిలదీశాడు. మీకు ఆ దమ్ము లేదన్నారు.

సినిమాలు తీసుకుంటే కోట్ల రూపాయలు వస్తాయన్నా విన్లేదు

సినిమాలు తీసుకుంటే కోట్ల రూపాయలు వస్తాయన్నా విన్లేదు

ప్రజల కోసం తన తమ్ముడు ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడని నాగబాబు చెప్పారు. తన తమ్ముడు తనతో మాట్లాడి కనీసం ఆరు ఏడు నెలలు అవుతోందని చెప్పారు. తన తమ్ముడిని నేను డిస్టర్బ్ చేయనని చెప్పారు. తన సోదరుడు ప్రజల కోసం అన్నింటిని వదిలి వెళ్లిపోయాడని అభిప్రాయపడ్డారు. సినిమాలు తీసుకుంటే కోట్ల రూపాయలు వస్తాయి కదారా.. ఉండవచ్చు కదా అని మేం చెప్పినా నా సోదరుడు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేం చెబితే కనీసం చెవిన కూడా పెట్టుకోలేదన్నారు. ప్రజల్లోకి వెళ్లిపోయాడన్నారు.

అలాంటి వాడిని విమర్శిస్తారా?

అలాంటి వాడిని విమర్శిస్తారా?

పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించాలంటే వాడికి ఎంతో ఉందని నాగబాబు చెప్పారు. అతను టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్టార్ అన్నారు. అయినప్పటికీ వాడు వెళ్లిపోయాడని చెప్పారు. అలాంటి వాడిని మీరు విమర్శిస్తారా అని మండిపడ్డారు. అలాంటి వాడిని తిడతారా అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్‌ను విమర్శంచవచ్చునని కానీ, రాజకీయంగా తప్పు చేస్తే నిలదీయండని నాగబాబు అబిప్రాయపడ్డారు. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏమిటన్నారు. ఎవడి వ్యక్తిగత జీవితంలోకి వెళ్లినా ఎన్నో ఉంటాయన్నారు. ఈ భూమి పైన తప్పు చేయని వాడు ఎవడూ లేడన్నారు. వ్యక్తిగతంగా గోతులు తవ్వాలంటే అందరూ దొరుకుతారని ధ్వజమెత్తారు. దయచేసి అలా వ్యక్తిగత జీవితంలోకి రావొద్దన్నారు.

నిశ్శబ్దం చేతకాని తనం కాదు, వెనుక రాజకీయ శక్తులు

నిశ్శబ్దం చేతకాని తనం కాదు, వెనుక రాజకీయ శక్తులు

పవన్ కళ్యాణ్ ఎంత వరకు ప్రజలకు మంచి చేస్తున్నారు, ఎంత వరకు చేయడం లేదని చూసి ఆలోచించి మాట్లాడాలని నాగబాబు హితవు పలికారు. ఇన్ని మాటలు తిట్టినా పవన్ ఒక్క మాట మాట్లాడలేదని, నిశ్శబ్దంగా ఉన్నాడని గుర్తు చేశారు. అతని నిశ్శబ్ధం చేతకానితనం అనుకోవద్దన్నారు. ఈ వాగేవారి వెనుకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో మీ పని పడతాడు

త్వరలో మీ పని పడతాడు

పవన్ కళ్యాణ్ సాధ్యమైనంత త్వరలో మీ అందరి దూల తీరుస్తాడని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షణంలో నేను ఇలా మాట్లాడటం కూడా తన తమ్ముడికి ఇష్టం లేదన్నారు. రేపు పొద్దున తనను పిలిచి ఈ మాట ఎందుకు అన్నావని తనను తిట్టినా తిడతాడని, అయినా నాకు ఫర్వాలేదన్నారు.

శ్రీరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్

శ్రీరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్

తన సమస్యపై పవన్ కళ్యాణ్ స్పందించాలని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ప్రతి సమస్యకు పవన్ రావాల్సిన అవసరం లేదన్నారు. పోలీస్ స్టేషన్ వెళ్లాలన్న పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. పోలీసులు, న్యాయవ్యవస్థ బాగున్నాయనే ధైర్యంతోనే మనం ఉన్నామన్నారు. మెగా ప్యామిలీ జోలికి రావొద్దన్నారు. సహనం పరీక్షించవద్దని చెప్పారు. తనను విమర్శించినా పవన్ సహనం కోల్పోలేదన్నారు. పవన్ తల్చుకుంటే ఏమైనా చేయగలడన్నారు. మా తల్లిని తిట్టినా కూడా శ్రీరెడ్డి ఓ ఆడకూతురు అని ఊరుకున్నారన్నారు.

English summary
Naga Babu held a press meet at the Film Chamber of Commerce building two days after Pawan Kalyan's name was dragged by a few women, including Sri Reddy. Pawan Kalyan suggested that Sri Reddy should take legal recourse. To this, she and other women slammed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X