వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాస్ మృతి: హోరెత్తిన ఆందోళనలు, రసమయికి చిక్కులు

ప్రభుత్వం చేస్తున్న భూ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని ఈ నెల 3న బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మాంకాళి శ్రీనివాస్‌, యాలాల పర్శరాములు అనే ఇద్దరు వ్యక్తులు మానకొండూర్‌ నియోజకవర్గ కార్యాలయం

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: ప్రభుత్వం చేస్తున్న భూ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని ఈ నెల 3న బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మాంకాళి శ్రీనివాస్‌, యాలాల పర్శరాములు అనే ఇద్దరు వ్యక్తులు మానకొండూర్‌ నియోజకవర్గ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకొన్న సంఘటన విదితమే.

తీవ్రంగా గాయపడ్డ మాంకాళి శ్రీనివాస్‌(27) హైద్రాబాద్‌లో 20 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. శ్రీనివాస్‌ మృతికి కారణమైన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం మధ్యాహ్నం మండలంలోని అల్గునూర్‌ చౌరస్తాలో అఖిలపక్ష నేతలు ఆందోళన యత్నం చేశారు.

ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనివాస్‌ మరణించడం దురదృష్టకరమని, ఈ ఘటనకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలన్నారు.

రసమయిపై ఆగ్రహం

రసమయిపై ఆగ్రహం

రాజీనామా చేయకుంటే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను బర్తరఫ్‌ చేయాలని కొత్త శ్రీనివాస్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. తెరాస దళితులపై చేస్తున్న నిర్లక్ష్య దాడులకు మంథని, నేరెళ్ల, గూడెం ఘటనలు నిదర్శమన్నారు. ప్రభుత్వంపై దళితులలో నమ్మకం కలగాలంటే ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

దిష్టిబొమ్మ దగ్ధం..

దిష్టిబొమ్మ దగ్ధం..

అనంతరం ధర్నా యత్నం, దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా అక్కడున్న పోలీస్‌ సిబ్బంది అనుమతి లేదంటూ వారిని అరెస్టు చేసి పోలీస్‌ శిక్షణా కేంద్రానికి తరలించారు. అరెస్టయిన వారిలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, జెర్రి పోతుల శంకర్‌, రామిడి మల్లారెడ్డి, కేతిరెడ్డి అంజిరెడ్డి, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు రంగు సంపత్‌ గౌడ్‌, మండలాధ్యక్షుడు గోపు మల్లారెడ్డి, మందల బక్కారెడ్డి, కనకం అశోక్‌, బీరం మల్లేశం, ఏనుగు చుక్కారెడ్డి, కొండ సురేష్‌, నరేందర్‌ తదితరులు ఉన్నారు.

ఒంటిపై కిరోసిన్ పోసుకుని...

ఒంటిపై కిరోసిన్ పోసుకుని...

ప్రభుత్వం చేస్తున్న భూ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని ఈ నెల 3న బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మాంకాళి శ్రీనివాస్‌, యాలాల పర్శరాములు అనే ఇద్దరు వ్యక్తులు మానకొండూర్‌ నియోజకవర్గ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకొన్న సంఘటన విదితమే.

మృతితో ఆగ్రహం..

మృతితో ఆగ్రహం..

తీవ్రంగా గాయపడ్డ మాంకాళి శ్రీనివాస్‌(27) హైద్రాబాద్‌లో 20 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. శ్రీనివాస్‌ మృతికి కారణమైన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం మధ్యాహ్నం మండలంలోని అల్గునూర్‌ చౌరస్తాలో అఖిలపక్ష నేతలు ఆందోళన యత్నం చేశారు.

English summary
All party leaders staged dharna protesting against TRS government following the death of dalith Mankali Srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X