వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో న్యూజెర్సీకి వెళ్ళాలని ఇలా, ఈ కష్టం రావద్దు,టెక్కీ శ్రీనివాస్ కూచిబొట్ల భార్య లేఖ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఆత్మ బంధువు మిత్రుడిని కోల్పోయాను,అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయాను, అతనో స్పూర్తి ప్రదాత అంటూ శ్రీనివాస్ కూచిబొట్ల సతీమణి సునయన తన భర్త శ్రీనివాస్ గురించి గుర్తు చేసుకొంది. ముఖం పై ఎప్పడు చెరగని నవ్వు శ్రీనివాస్ ముఖంపై ఉంటుందని సునయన చెప్పారు. తన భర్త మరణంపై ఆమె తన ఆవేదనను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

అమెరికాలోని కేనాస్ లో జరిగిన కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిబొట్ల మరణించాడు. ఈ ఘటనలో ఆలోక్ రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.

శ్రీనివాస్ కూచిబొట్ల మరణం తర్వాత అమెరికాలో నివసిస్తున్న భారతీయులు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.అయితే శ్రీనివాస్ కూచిబొట్ల మృతదేహం

సోమవారం రాత్రి హైద్రాబాద్ కు చేరుకొంది.మంగళవారం మధ్యాహ్నం శ్రీనివాస్ అంత్యక్రియలు జరిగాయి.

శ్రీనివాస్ మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో నివసించే ఇతర దేశాలకు చెందినవారిపై దాడులు ఎక్కువవయ్యాయి

ప్రతి ఒక్కరిని గౌరవించేవారు.

ప్రతి ఒక్కరిని గౌరవించేవారు.

గత నెల 22వ, తేదిన తనకు కాళరాత్రి, ఆ రోజు తాను తన భర్త శ్రీనివాస్ కూచిబొట్లను కోల్పోయాయని ఆయన భార్య సునయన ఆవేదన చెందారు. ఆత్మబంధువు,

మిత్రుడిని, అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయానని ఆమె చెప్పారు.స్పూర్తి ప్రదాత, సహయకారి, తనకు ఒక్కరికే కాదు, తన గురించి తెలిసిన వారందరికీ ఎవరు ఎదురైనా ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేదని ఆమె గుర్తు చేశారు.ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. తన కంటే పెద్దవారి పట్ల ఇంకా గౌరవభావంతో మెలిగివాడని చెప్పారు. తన భర్తతో తన అనుబంధం గురించి ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

''కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం''

''కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం''

2006 ఆగష్టులో కామన్ ఫ్రెండ్స్ ద్వారా తమ మద్య పరిచయం ఏర్పడిందని సునయన చెప్పారు.తర్వాత ఆర్కుట్ ద్వారా పలకరించుకొనేవాళ్లమని ఆమె మధుర సృతులను గుర్తుచేసుకొన్నారు.

తొలి పరిచయంతోనే ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం.మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో తానే చిన్నదాన్ని. చాలా గారాభంగా, స్వేచ్చగా పెరిగాను.అమెరికాకు వెళ్ళి చదువుకొనే ధైర్యాన్ని శ్రీనివాస్ ఇచ్చాడు. తాను ఇలా ధైర్యంగా నిలబడడానికి శ్రీనివాసే కారణమని చెప్పారు.

అమెరికాలో ఉద్యోగం చేయడం వెనుక శ్రీనివాస్ కృషి

అమెరికాలో ఉద్యోగం చేయడం వెనుక శ్రీనివాస్ కృషి


అమెరికాలో గత ఏడాది నుండి మే మాసం నుండి తాను ఉద్యోగం చేస్తున్నానని ఈ ఉద్యోగం చేయడానికి గాను శ్రీనివాస్ కారణమని ఆమె గుర్తు చేసుకొన్నారు.

తనకు ఉద్యోగం రావడం వెనుక కూడ శ్రీనివాస్ కృషి ఉందన్నారు.తాను నిరాశ పడిన సందర్భాల్లో వెన్నుతట్టి ప్రోత్సహించాడని ఆమె శ్రీనివాస్ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకొన్నారు. పిల్లలంటే తనకు చాలా ఇష్టమని ఆమె గుర్తు తెచ్చుకొన్నారు.

విమాన రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం శ్రీనివాస్ తపించేవాడు

విమాన రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం శ్రీనివాస్ తపించేవాడు

విమానయాన రంగంలో నిరంతరం కొత్త ఆవిష్కరణల కోసం శ్రీనివాస్ తపించేవాడు. రాక్ వెల్ కోలిన్స్ కంపెనీలో చేరడం ద్వారా శ్రీనివాస్ తన కెరీర్ ను ప్రారంభించాడని ఆమె గుర్తు చేశారు. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ పై పనిచేసేవాడు. ప్రాథమిక ప్లైట్ కంట్రోల్ కంప్యూటర్ అభివృద్ది కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు.

రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చి అధికాగానే ఆఫీసుకు వెళ్ళిపోయిన రోజులు చాలానే ఉన్నాయి.తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేవాడు. రాక్ వెల్ లో ఉద్యోగంతో ఆయన చాలా సంతోషంగా ఉండేవాడు. అయోవాలోని చిన్న పట్టణం సెడార్ రాపిడ్స్ లో ఉండడానికి కూడ ఇష్టపడ్డాడు.అయితే నేను ఉద్యోగం సంపాదించడానికి నా కలలను సాకారం చేసుకోవడానికి గాను కాన్సస్ పట్టణానికి మారాలని వచ్చాం.

స్వంత ఇల్లుకు శ్రీనివాస్ రంగులు వేశాడు

స్వంత ఇల్లుకు శ్రీనివాస్ రంగులు వేశాడు

కాన్సస్ స్వంతింటి కలను నేరవేర్చుకొన్నాం. కొత్త ఇంటికి శ్రీనివాస్ రంగులు వేశాడు. గ్యారేజీకి తలుపు బిగించాడు. ఇంటికి సంబంధించిన ఏ పనైనా ఇష్టంగా చేశాడు.

పుట్టబోయే పిల్లల కోసం కట్టిన ఇల్లు ఇది. మాకంటూ చిన్ని కుటుంబానికి ఏర్పాటు చేసుకోవడానికి వేసిన తొలి అడుగు.పోలీసులు ఇంటికి వచ్చి శ్రీనివాస్ మరణించాడని చెబితే తాను నమ్మలేదని ఆమె గుర్తుచేసుకొన్నారు.

ఇదే విషయమై పలు ప్రశ్నలతో పోలీసులను వేధించానని ఆమె చెప్పారు. శ్రీనివాస్ ఫోటోను చూపితే పోలీసులు గుర్తుపట్టి చనిపోయిన వ్యక్తి శ్రీనివాసే అని నిర్థారించారని ఆమె ఆ లేఖలో చెప్పారు.

విమానంలో న్యూజెర్సీకి వెళ్ళాలని శవపేటికతో ఇండియాకు

విమానంలో న్యూజెర్సీకి వెళ్ళాలని శవపేటికతో ఇండియాకు


మార్చి 9వ, తేదిన 33వ, ఏట శ్రీనివాస్ అడుగుపెట్టేవాడు. తన కజిన్ ఎంగేజ్ మెంట్ కోసం న్యూజెర్సీకి విమానంలో వెళ్ళాలని ప్లాన్ చేసుకొన్నాం. ఈ ట్రిప్ కొరకు వీకెండ్ లో షాపింగ్ చేయాలని నిర్ణయించుకొన్నాం.


కానీ, ఇండియాకు శ్రీనివాస్ శవపేటికతో వచ్చామని ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది.మా తల్లిదండ్రులను, వారి తల్లిదండ్రులను శ్రీనివాస్ ఒప్పించాడు,మా తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పి పెళ్ళికి ఒప్పించాడని ఆమె గుర్తు చేసుకొంది.

ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి ఆందోళన

ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి ఆందోళన

ఇమ్మిగ్రేషన్ విధానం,చట్టాల గురించి ఆందోళన చెందేవాడు. ఇంటర్నెట్ లో ఈ అంశాలను చాలా ఆసక్తితో చదివేవాడు. అమెరికా శాశ్వత నివాస కార్డు కోసం ధరఖాస్తు

చేసి ఏళ్ళు గడిచిపోతోంది. ఇంకెన్నాళ్ళు ఎదురుచూడాలో అని అనేవాడు. హెచ్ 1 బీ వీసాలపై వచ్చినవారి జీవిత భాగస్వామ్యులు ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే హెచ్ 4 ఈఏడీ రూల్ చట్టసభల ఆమోదం పొందినప్పుడు సంతోషపడ్డాడు.

ఇయాన్ గ్రిలాట్ కోలుకోవాలి

ఇయాన్ గ్రిలాట్ కోలుకోవాలి

తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి సునయన ధన్యవాదాలు తెలిపారు. నేను అమెరికాలో కెరీర్ నిర్మించుకోవాలనేది శ్రీనివాస్ కల.


ఈ కలను నెరవేర్చుకొనేందుకు నేను అమెరికా తిరిగి రావాలి. నా భర్తను కాపాడడానికి ప్రయత్నించి గాయపడ్డ ఇయాన్ గ్రిలాట్ త్వరగా కోలుకోవాలని సునయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.ద్వేషాన్ని ఆపాలి ప్రేమను వ్యాపింపజేయాలి.మా కుటుంబానికి వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదని ఆమె కోరుకొన్నారు.

నరేంద్ర మోడీ అంటే ఇష్టం

నరేంద్ర మోడీ అంటే ఇష్టం

భారత్ గురించి, ప్రధాని మోడీ గురించి తన భర్త శ్రీనివాస్ గర్వంగా ఫీలయ్యేవారని చెప్పారు. అర్నాబ్ గో స్వామి షో ఎంజాయ్ చేసేవాడని, మళ్లీ ఎప్పుడు టీవీ తెర పైన కనిపిస్తాడా అని ఎదురు చూసేవాడని ఆమె చెప్పారు.

English summary
He was always worried about immigration and its laws. He followed them very closely over the internet. There were days when he used to talk about how it’s been quite a few years since we applied for our permanent residency card, and he didn’t know how much longer we have to wait for it. He used to say having one would give him the chance to explore even more his passion for the aviation industry. He very closely monitored the H4 EAD rule and did whatever he could do in his capacity for the rule to be passed - not just for me, but for every woman and for those who deserve a career and a chance to fulfill their dreams," she wrote.In her heartfelt post, she questioned the hatred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X