హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిత్య పెళ్లి కొడుక్కి టీఆర్ఎస్ షాక్: ఇంటి ముందే సంగీత, ‘ఆడపిల్లతో ఎమ్మెల్యే ఇలానా?’

ఆడ‌పిల్ల పుట్టిందనే కారణంతో త‌న భార్య సంగీత‌ను చావ‌బాది, ఇంటి నుంచి గెంటేసిన బోడుప్ప‌ల్ నిత్య పెళ్లి కొడుకు, టీఆర్ఎస్ నేత‌ శ్రీనివాస్ రెడ్డిపై వేటు పడింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆడ‌పిల్ల పుట్టిందనే కారణంతో త‌న భార్య సంగీత‌ను చావ‌బాది, ఇంటి నుంచి గెంటేసిన బోడుప్ప‌ల్ నిత్య పెళ్లి కొడుకు, టీఆర్ఎస్ నేత‌ శ్రీనివాస్ రెడ్డిపై వేటు పడింది. శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్.. శ్రీనివాస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది.

Recommended Video

TRS Leader Srinivas Reddy Arrest : టీఆర్ఎస్ నేత రాస లీలలు | Oneindia Telugu

త‌న భ‌ర్త మ‌రో పెళ్లి చేసుకున్నాడ‌ని తెలుసుకున్న హైద‌రాబాద్ చందాన‌గ‌ర్‌కు చెందిన‌ సంగీత త‌న భర్త ఇంటికి వచ్చి అతడిని నిలదీయగా, ఆమెను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటేసిన విష‌యం తెలిసిందే.

రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు

మూడో రోజూ ఇంటిముందే సంగీత..

మూడో రోజూ ఇంటిముందే సంగీత..

కాగా, శ్రీనివాసర్ రెడ్డి భార్య సంగీత మాత్రం అతని ఇంటి ముందే తన పోరాటాన్ని మంగళవారం కూడా కొనసాగిస్తోంది. ఆమెకు మ‌హిళా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్ర‌స్తుతం సంగీత భ‌ర్త ఇంటి ముందే కూర్చుని పోరాడుతోంది.

ఆడపిల్లతో ఎమ్మెల్యే ఇలాగేనా?

ఆడపిల్లతో ఎమ్మెల్యే ఇలాగేనా?

ఈ నేప‌థ్యంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్క‌డకు వ‌చ్చి వెళ్లారు. అయితే, ఆయ‌న‌తో మ‌హిళా సంఘాలు గొడ‌వ‌కు దిగాయి. ఆయ‌న మాట తీరు బాగోలేద‌ని చెప్పాయి. ఏ న్యాయం కావాలి నీకు? అంటూ త‌న‌తో స‌ద‌రు ఎమ్మెల్యే మాట్లాడా‌డ‌ని సంగీత మీడియాతో చెప్పింది. శ్రీనివాస్ రెడ్డికి మ‌ద్దతుగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతున్నట్లు అనిపించింద‌ని తెలిపింది. ఇంటి తాళాలు ప‌గుల‌కొడ‌తామ‌ని, ఇంట్లోకి వెళ్లి ఉండ‌మ‌ని అన్నార‌ని చెప్పారు. ‘శ్రీనివాస్ రెడ్డిని ఇంట్లోకి రానివ్వ‌కుండా చేస్తా' అంటూ ఏవేవో మాట్లాడార‌ని, త‌న‌కు న్యాయం చేసే ప‌ద్ధ‌తి ఇదేనా?' అని సంగీత ప్ర‌శ్నించింది.
ఎమ్మెల్యే హోదాలో ఉండి సుధీర్ రెడ్డి ఒక ఆడ‌పిల్ల‌తో ఇలాగేనా మాట్లాడేది? అని స‌ంగీత ప్ర‌శ్నించింది. మొద‌ట త‌న అత్తామామ‌ల‌ను అరెస్టు చేయాలని, త‌న‌కు ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే వ‌చ్చి, ఏదో మాట్లాడి వెళ్లిపోయార‌ని, త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న భ‌ర్త ఇంటి ముందు నుంచి క‌ద‌ల‌బోన‌ని సంగీత తేల్చి చెప్పింది.

సంగీత ఏం చెప్పిందంటే..

సంగీత ఏం చెప్పిందంటే..

సంగీత చెప్పిన వివరాల ప్రకారం.. మొదటి భార్య స్వాతికి విడాకులిచ్చిన శ్రీనివాస్‌రెడ్డితో సంగీతకు 2013 అక్టోబరు 19న పెళ్లి జరిగింది. రెండేళ్లకు వారికి కుమార్తె పుట్టింది. అప్పటికే అతనికి పరాయి మహిళలతో వివాహేతర సంబంధం ఉంది. ఇదేమని అడిగినందుకు వేధింపులు అధికమయ్యాయి. తండ్రిలేని తనను అదనపు కట్నం కోసం అత్త,మామ, ఆడపడుచు, భర్త వేధించేవారు. శ్రీనివాస్‌రెడ్డి మద్యం మత్తులో తనపై దాడిచేయడంతో ఒక చెవికి చెవుడు వచ్చింది. అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు శ్రీనివాస్‌రెడ్డి తనను చంపేస్తానని బెదిరించేవాడు. దాంతో కొంతకాలం భర్తకు దూరంగా ఉన్నట్లు పేర్కొంది.

వేధింపులు అధికమవడంతో..

వేధింపులు అధికమవడంతో..

శ్రీనివాస్ రెడ్డి ఆగడాలు మితిమీరడంతో చందానగర్‌ ఠాణాలో వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ఈ ఏడాది ఆగస్టులో భర్త మరోపెళ్లి చేసుకున్నాడని తెలిసి అడిగేందుకు వచ్చింది సంగీత. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికార పార్టీలో కొనసాగుతున్న తన భర్తపై పోలీసులు కేసు నమోదుచేసేందుకు నిరాకరించినట్లు చెప్పింది సంగీత. రాచకొండ కమిషనర్‌ను కలువగా వెంటనే కేసు నమోదు చేసి భర్తను రిమాండ్‌కు పంపించారని మిగతావారిని కోర్టులో లొంగిపోయేలా సహకరించారని ఆరోపించింది. అమానుషంగా వ్యహరిస్తున్న పులకండ్ల శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని కఠినంగా శిక్షించడంతో పాటు న్యాయం జరిగే వరకు పోరాడుతానని సంగీత స్పష్టం చేసింది.

సంగీతకు మద్దతుగా..

సంగీతకు మద్దతుగా..

సంగీత నిరసనకు ఐద్వాలతోపాటు బోడుప్పల్‌ మున్సిపాలిటీ కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య మహిళా విభాగం సంఘీభావం ప్రకటించాయి. బేటీ బచావో-బేటీ పడావో రాష్ట్ర కో-కన్వీనర్‌ రాణిసుధాకర్‌ సంగీత చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించారు. పులకండ్ల శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మూడో భార్య దేవి జగదీశ్వరి తల్లి శిరీష కూడా సంగీతకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తన కుమార్తె కన్పించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేస్తే 20 రోజుల తర్వాత ‘మీ అమ్మాయి మేజర్‌' అని పోలీసులు బెదిరించారని ఆరోపించింది. తన కుమార్తెను మాయమాటలతో మోసం చేసిన శ్రీనివాస్‌రెడ్డిని కఠినంగా శిక్షించడంతోపాటు తన కుమార్తెను అప్పగించాల్సిందిగా శిరీష కోరారు.

తల్లి వద్దకు చేరిన దేవి జగదీశ్వరి

తల్లి వద్దకు చేరిన దేవి జగదీశ్వరి

సోమవారం ఉదయం కన్పించకుండా పోయిన దేవి జగదీశ్వరి.. రాత్రికి ఇంటి ముందు ప్రత్యక్షమైంది. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం..తన కుమార్తె కన్పించడం లేదని ఎవరో కిడ్నాప్‌ చేశారని దేవి జగదీశ్వరి తల్లి బోడుప్పల్‌ శ్రీనగర్‌కాలనీకి చెందిన శిరీష సోమవారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవి జగదీశ్వరి పులకండ్ల శ్రీనివాస్‌రెడ్డి మూడో భార్య. ఆదివారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం రెండో భార్య సంగీతపై దాడిచేసిన ఘటనలో పోలీసులు దేవి జగదీశ్వరిని నాలుగో నిందితురాలిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అనూహ్య పరిణామాల మధ్య దేవి జగదీశ్వరి తల్లి శిరీష ఇంటికి చేరింది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తాను ఇంటర్‌ చదువుతుండగానే శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న ప్రేమ కారణంగా పెళ్లి చేసుకున్నామని చెప్పింది.తాను చేసింది తప్పు అని తెలిసి తల్లి దగ్గరకు వచ్చినట్లు పేర్కొంది.

శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్

శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్

మేడిపల్లి పోలీసులు శ్రీనివాసరెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఇంఛార్జి సీఐ ముని, ఎస్సై ఎలక్షన్‌రెడ్డిల కథనం ప్రకారం.. బోడుప్పల్‌ శ్రీనగర్‌ కాలనీకి చెందిన పులకండ్ల శ్రీనివాస్‌రెడ్డి(36), తల్లి ఐలమ్మ, తండ్రి బాల్‌రెడ్డి, మూడో భార్య దేవి జగదీశ్వరిపైన హత్యాయత్నం కేసు నమోదైనట్లు చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఆస్పత్రి అమానుషం: డెంగ్యూతో చిన్నారి మృతి, రూ.16లక్షల బిల్లు వేసిందిఆస్పత్రి అమానుషం: డెంగ్యూతో చిన్నారి మృతి, రూ.16లక్షల బిల్లు వేసింది

వేదికపై మోడీ-ఇవాంకా-కేసీఆర్ మాత్రమే: భద్రత కట్టుదిట్టంవేదికపై మోడీ-ఇవాంకా-కేసీఆర్ మాత్రమే: భద్రత కట్టుదిట్టం

సంపదలో సగభాగం దాతృత్వానికే: ‘ఇన్ఫోసిస్' నీలేకని సంచలనం, భగవద్గీతే ప్రేరణసంపదలో సగభాగం దాతృత్వానికే: ‘ఇన్ఫోసిస్' నీలేకని సంచలనం, భగవద్గీతే ప్రేరణ

షాక్: జీహెచ్ఎంసీ తరలించిన యాచకుల్లో కోటీశ్వరులు!షాక్: జీహెచ్ఎంసీ తరలించిన యాచకుల్లో కోటీశ్వరులు!

English summary
It is said that youth leader Srinivas Reddy suspended from TRS Party on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X