వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ కేంద్రంలో లోపల గదులు.. అందులో ఉంటే సేఫ్: గువ్వల బాలరాజు, ప్రమాదంపై సీఎం దిగ్బ్రాంతి..

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంతో ఆందోళన నెలకొంది. అందులో ఉన్న 8 మందిని బయటకు తీయగా.. 9 మంది లోపలే ఉన్నారు. దీంతో వారి పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం రాత్రి ప్రమాదం జరగగా.. ఘటన జరిగిన గంటపాటు వారి ఫోన్లు పనిచేశాయి. తర్వాత ఫోన్లు కలువకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆంటకం ఏర్పడుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, విప్ గువ్వల బాలరాజు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఏడుగురు జెన్ కో సిబ్బంది.. ఇద్దరు ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్లు

ఏడుగురు జెన్ కో సిబ్బంది.. ఇద్దరు ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్లు

లోపల చిక్కుకున్న వారిలో ఏడుగురు జెన్ కో సిబ్బంది కాగా ఇద్దరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్‌, ఆమ్రాన్‌ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ లోపల ఉన్నారు. బయటకు వచ్చిన 8 మందిలో ఇద్దరు క్షేమంగా ఉన్నారని.. ఆరుగురు అస్వస్థతకు గురి కావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆక్సిజన్‌ పెట్టుకున్నా వారు ఉన్న చోటుకి వెళ్లలేకపోతున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు.

ఆ 8 మంది ఎలా వచ్చారంటే..

ఆ 8 మంది ఎలా వచ్చారంటే..

ప్రమాదం జరిగిన టన్నెల్‌లో ఎగ్జిట్ ద్వారానికి 8 మంది దగ్గరగా ఉండటంతో పరుగులు తీసి బయటకు వచ్చేశారు. మిగతా వారు కాస్త లోపల ఉండటంతో పొగలో చిక్కుకున్నారు. లోపల కొన్ని గదులు కూడా ఉన్నాయని గువ్వల బాలరాజు చెప్పారు. లోపల ఉన్నవారు గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉంటే సేఫ్ అని చెప్పారు. వారిని రక్షించేందుకు ఛాన్సెస్ ఉన్నాయని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో అతిపెద్ద ప్రమాదాన్ని తప్పించామని బాలరాజు పేర్కొన్నారు.

ఎన్డీఆర్ఎఫ్‌కు సింగరేణి సిబ్బంది సాయం..

ఎన్డీఆర్ఎఫ్‌కు సింగరేణి సిబ్బంది సాయం..

సింగరేణి నుంచి భూ గర్భంలో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి పనిచేసే నైపుణ్యమున్న సిబ్బంది.. ఎన్డీఆర్ఎఫ్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పొగ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. వర్షం పడటం, డ్యామ్ నిండుగా నీళ్లు ఉండటంతో విద్యుత్ సరఫరా రాత్రే నిలిపివేశారు. రాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టలేదు. ఉదయం సహాయక సిబ్బంది లోనికి వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు.

Recommended Video

సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్‌ కుమార్‌కు కారు ప్రమాదం..!!
సీఎం దిగ్బ్రాంతి..

సీఎం దిగ్బ్రాంతి..


శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెతలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని ఆయన ఆకాంక్షించారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుతో సీఎం ఫోన్‌లో మాట్లాడి.. పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు.

English summary
srisailam power house inside some rooms, if 9 members in room..they are safe whip guvvala balaraj said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X