వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలం ప్రమాదానికి కారణం చెప్పిన కలెక్టర్.. ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయన్న జెన్ కో సీఎండీ

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు . ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ శర్మన్ రాత్రి 10:30 గంటలకు జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగిందని ,ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి అని ఆయన పేర్కొన్నారు. దట్టమైన పొగ కారణంగానే విద్యుత్ జల కేంద్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారని,బయటకు వచ్చే అన్ని దారుల్లో కూడా దట్టమైన పొగ అలుముకుంది అని ఆయన పేర్కొన్నారు.

 షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన ..దట్టమైన పొగ కారణంగానే సహాయక చర్యల్లో జాప్యం

షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన ..దట్టమైన పొగ కారణంగానే సహాయక చర్యల్లో జాప్యం

ఎమర్జెన్సీ ద్వారం వద్ద కూడా దట్టంగా పొగలు రావడంతో లోపల నుండి సిబ్బంది బయటకు వచ్చే వీలు లేకుండా పోయిందని ఆయన వివరించారు.
అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించాలని, లోపల చిక్కుకున్న వారిని కాపాడడం కోసం వెళ్ళిన రెస్క్యూ టీం పొగ కారణంగా వెనక్కి వచ్చారని ఆయన తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ప్రస్తుతం గాయపడిన ఆరుగురు సిబ్బంది జెన్ కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ శర్మన్ వివరించారు. పొగను కంట్రోల్ చేసి లోపల చిక్కుకున్న వారిని రక్షించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు .

 ముమ్మరంగా సహాయక చర్యలు .. పర్యవేక్షిస్తున్న జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు

ముమ్మరంగా సహాయక చర్యలు .. పర్యవేక్షిస్తున్న జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు

శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో అర్థరాత్రి జరిగిన ఈ భారీ ప్రమాదం లో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యలను తెలంగాణ జెన్ కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద స్థలంలో పరిస్థితిని గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కేంద్రం లోని పొగ తీవ్రతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని లోపలి చిక్కుకున్న వారిలో ఏడుగురు జెన్కో సిబ్బంది ,ఇద్దరు అమర రాజా కంపెనీ సిబ్బంది ఉన్నారని వారిని రక్షించడమే లక్ష్యంగా సహాయక చర్యలు సాగుతున్నాయని పేర్కొన్నారు.

లోనికి వెళ్తేనే కారణాలు, నష్టం అంచనా వేసేది : సీఎండీ ప్రభాకర్ రావు

లోనికి వెళ్తేనే కారణాలు, నష్టం అంచనా వేసేది : సీఎండీ ప్రభాకర్ రావు


మూడు అగ్నిమాపక యంత్రాలతో పొగ ను కంట్రోల్ చేస్తూ అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మెయిన్ ప్లాంట్ లోకి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, లోపలికి వెళ్ళి పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలను, నష్టాన్ని అంచనా వేయవచ్చని సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు.


ముందు సిబ్బందిని సురక్షితంగా కాపాడటమే లక్ష్యం అని ఆయన అన్నారు .

జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న వాళ్ళు వీరే .. కాపాడే యత్నాల్లో అగ్నిమాపక సిబ్బంది

జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న వాళ్ళు వీరే .. కాపాడే యత్నాల్లో అగ్నిమాపక సిబ్బంది

అగ్ని ప్రమాద ఘటనలో జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన డిఈ శ్రీనివాస్ గౌడ్, పాల్వంచ కు చెందిన ఏఈ వెంకట్రావు, హైదరాబాద్ కు చెందిన ఏఈలు మోహన్ కుమార్, ఉజ్మా ఫాతిమా,సూర్యాపేటకు చెందిన ఏఈ సుందర్,ఖమ్మం జిల్లాకు చెందిన ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, పాల్వంచకు చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ , హైదరాబాద్ అమర్ రాజా కంపెనీకి చెందిన వినేష్ కుమార్,మహేష్ కుమార్ లు లోపల చిక్కుకుపోయారు. ప్రస్తుతం వీరిని కాపాడే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

English summary
Nagar Kurnool District Collector Sharman said the short circuit was the main cause of the fire at Srisailam Hydroelectric Power Station. Collector Sharman, who inspected the accident site, said a fire broke out at the hydropower plant around 10:30 pm due to a short circuit and the crew could not get out as the smoke spread thickly. Genco CMD Prabhakar Rao said relief efforts were in full swing and efforts were being made to protect the staff inside. .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X