వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన పని అయిపోయింది: వెలుగులోకి శ్రీశైలం ప్రమాద ఘటనలో ఏఈల సంభాషణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ ఆడియో వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో ఈ ఘటనలో మృతి చెందిన ఏఈలు సుందర్, మోహన్‌ల సంభాషణ వెలుగుచూసింది.

Recommended Video

Srisailam ప్రమాద ఘటనలో 9 మంది మృతి...!! 50 లక్షలు, రూ. 25 లక్షల చొప్పున CM KCR ఆర్థిక సాయం!
ప్రమాద దృశ్యాలు.. కన్నీటిపర్యంతమైన మోహన్ సతీమణి..

ప్రమాద దృశ్యాలు.. కన్నీటిపర్యంతమైన మోహన్ సతీమణి..

ప్రమాద ఘటనలో చనిపోయే ముందు మోహన్.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీశాడు. శనివారం మోహన్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టిన అతడి భార్య అందులోని ప్రమాద వీడియో దృశ్యాలు, సంభాషణను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

చనిపోయే కొన్ని క్షణాల ముందు ఏఈల సంభాషణ..

చనిపోయే కొన్ని క్షణాల ముందు ఏఈల సంభాషణ..

సుందర్: ఇక కష్టం.. మన పని అయిపోయింది.. ఆశలు వదులుకో

మోహన్: లేదు.. ఆశగా ఉండాలె.. కొద్ది సేపు ఆలోచించుకుని పోదాం.
సుందర్: ఆలోచించే సమయం లేదు.. ఇక మనం బతకం.. పొగ మొత్తం అలుముకుంది. కాగా, సుందర్, మోహన్ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు కానీ, ఫలితం లేకపోయింది.

పిల్లలు జాగ్రత్త అంటూ ఏఈ సుందర్..

పిల్లలు జాగ్రత్త అంటూ ఏఈ సుందర్..

కాగా, అంతకుముందు సుందర్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణ కూడా వెలుగులోకి వచ్చింది. ‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో కాపాడలేకపోతే బతికే పరిస్థితి లేదు' అని సుందర్ చివరిసారిగా తన కుటుంబసభ్యులతో మాట్లాడారు.

ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో 17 మంది సిబ్బం ఉండగా.. 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుగుతోంది.

ప్రమాద ఘటనపై విచారణ కొత్త కమిటీ

ప్రమాద ఘటనపై విచారణ కొత్త కమిటీ

శ్రీశైల విద్యుత్ కేంద్రం ప్రమాద ఘటన బాధాకరమని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేశామని, కానీ, విషాదమేమిగిలిందన్నారు. పవర్ జనరేషన్ ఎక్కువ ఉందని

ఆపేశామని, వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. మృతుల కుటుంబాలకు సాయం చేస్తామని, ప్రమాదంపై ఇంటర్నల్ కమిటీ వేశామని ప్రభాకర్ రావు వెల్లడించారు. తాజాగా, శ్రీశైలం ప్రమాద ఘటనపై టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. సీఐడీతో సంబంధం లేకుండా వీరు ప్రత్యేక దర్యాప్తు చేయనున్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఆదేశించారు.
ఈ కమిటీలో సభ్యులుగా..
శ్రీనివాసరావు-జేఎండీ
జగత్ రెడ్డి-ట్రాన్సిమిషన్ డైరెక్టర్
సచ్చిదానందం-ప్రాజెక్టు డైరెక్టర్, టీఎస్ జెన్‌కో
రత్నాకర్-కన్వీనర్‌.

English summary
srisailam power plant accident deceased aes final conversation released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X