వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: డాక్టర్ సెల్‌ఫొన్‌లో చెబితే.. నర్సులు ఆపరేషన్‌ చేశారు, బిడ్డ మృతి

డాక్టర్ ఫోన్లో సూచనలిస్తూ నర్సులతో ఓ గర్భిణీకి ఆపరేషన్ చేయించిన ఘటన జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కాగా, నర్సులు ఆపరేషన్ చేయడంతో పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోయింది.

|
Google Oneindia TeluguNews

జగిత్యాల: జిల్లా ఆస్పత్రిలో ఓ వైద్యురాలు విధుల హాజరుకాకుండానే ఫోన్‌లో సూచనలిస్తూ నర్సులతో ఆపరేషన్‌ చేయించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కాగా, నర్సులు ఆపరేషన్ చేయడంతో పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ బిడ్డ తల్లికి తీరని శోకమే మిగిలింది. అయితే, ఈ విషయం బయటపడకుండా వైద్యులు అనేక ప్రయత్నాలు చేయడం గమనార్హం

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన గర్భిణి ఇర్ఫానీకి పురిటి నొప్పులు రాగా, ఆశా కార్యకర్త మల్లేశ్వరి సాయంతో జులై 1న ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి సాధారణ కాన్పు అవుతుందని చెప్పారు. గురువారం అర్ధరాత్రి ఇర్ఫానీకి నొప్పులతోపాటు తీవ్ర రక్తస్రావం జరిగింది.

staff treats a pregnant at jagtial district hospital

దీంతో వైద్య సిబ్బంది.. డ్యూటీలో ఉన్న వైద్యురాలికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వైద్యురాలు ఆస్పత్రికి రాకుండానే సిబ్బందికి ఫోన్‌లోనే డెలివరీకి సంబంధించిన సూచనలు చేయగా.. వారు చిన్న ఆపరేషన్‌ చేశారు.
ఈ క్రమంలో ప్రసవం జరగకపోగా.. గర్భిణి అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది.

విషయం వైద్యురాలికి వివరించడంతో ఆమె ఆస్పత్రికి వచ్చి.. పెద్ద ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీసింది. మగ శిశువు జన్మించినా వెంటనే మృతిచెందాడు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయాడని ఇర్ఫానీ భర్త రహమాన్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా, శిశువు మృతి ఘటనలో వైద్య సిబ్బంది తప్పేమీ లేదని సూపరింటెండెండ్‌ అశోక్‌కుమార్‌ వివరణ ఇవ్వడం గమనార్హం. రాత్రి నొప్పులు రావడంతో గైనకాలజిస్ట్‌ వైద్య సమాచారం ఇచ్చారని, వెంటనే ఆమె ఆస్పత్రికి వచ్చి చికిత్స చేశారన్నారు. అయితే, బాబు మృతిచెందాడన్నారు. ఈ విషయమై ఇర్ఫానా భర్త షేక్ రహమాన్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన బిడ్డ మృతి చెందాడనీ, గురువారం రోజునే శస్త్ర చికిత్స చేస్తే బాబు బతికేవాడని తెలిపారు.

English summary
It is said that few Staff gives treatment to a a pregnant at jagtial district hospital, when doctor is not there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X