• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

By Nageshwara Rao
|

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా సర్వం సిద్ధమైంది. తెలంగాణలో మోడీ పర్యటన నేపథ్యంలో గజ్వేల్, హైదరాబాద్‌లలో అడుగడుగునా భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు మూడు వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని పాల్గొనబోయే గజ్వేల్, ఎల్బీ స్టేడియంలోని సభా ప్రాంగణాలను ఎన్‌ఎస్‌జీ అధికారులు పరిశీలించారు. బాంబు స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు నిర్వహించారు. కాగా, ప్రధాని మోడీ సభ సందర్భంగా నగరంలోని ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు విధించారు.

ప్రధాని మోడీ మెదక్ పర్యటన సందర్భంగా భద్రత బాధ్యతను హైదరాబాద్ అకున్‌ సబర్వాల్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యనట సాగుతుందిలా... ఆదివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి 2.10 నిమిషాలకు ప్రధాని మోడీ బయల్దేరి మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలుకుతారు. అదే సమయానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు, బండారు దత్తాత్రేయ కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి 2.25కు మూడు ప్రత్యేక హెలికాప్టర్లలో అంతా కోమటిబండకు బయల్దేరుతారు.

ప్రధాని మోడీ ప్రయాణించే హెలికాప్టర్‌లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రమే ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ గ్రామం చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం లభిస్తుంది.

3.01 గంటలకు మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్లాలద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేసే మోటర్ పంపుసెట్‌కు స్విచాన్ చేస్తారు. ఆ వెంటనే స్వయంగా నల్లా తిప్పి దాని ద్వారా నీటిని విడుదల చేస్తారు. అనంతరం ఐదు నిమిషాలపాటు మిషన్ భగీరథ ప్రాజెక్టు అమలయ్యే విధానానికి సంబంధించిన ప్రజెంటేషన్‌ను తిలకిస్తారు.

ఆ తర్వాత 3.15 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ ప్లాంట్ యూనిట్‌కు రిమోట్‌ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఆ వెంటనే రామగుండంలోని ఎరువుల కర్మాగారానికి, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్‌కు, వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి రిమోట్ ద్వారానే శంకుస్థాపన చేస్తారు.

 ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి కాలరీస్ సంస్థ నెలకొల్పిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారు. 3.25 గంటలకల్లా ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. అనంతరం బహిరంగసభా వేదిక వద్దకు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ముుందుగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మూడు నిమిషాల పాటు స్వాగతోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఏడు నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ 3.37 గంటల నుంచి 4.10 గంటల వరకు ప్రసంగిస్తారు. 4.15 గంటలకల్లా కార్యక్రమాన్ని పూర్తి చేసేలా షెడ్యూల్‌ తయారైంది.

 ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

కార్యక్రమంలో చివరగా ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వందన సమర్పణ చేస్తారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో 2లక్షల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ పాల్గొనే ఈ కార్యక్రమం మొత్తం గంటన్నరపాటు కొనసాగుతుంది.

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక ఏర్పాట్లను ఇప్పటికే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు సిబ్బంది పరిశీలించారు. వేదికపై ఇరవై మంది మాత్రమే కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. వేదికపై మధ్యలో ప్రధాని మోడీ ఉంటే, ఆయనకు ఎడమవైపున వరుసగా సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు సీ లకా్ష్మరెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే కేశవరావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కే రాజమణి ఉంటారు.

 ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ప్రధాని మోడీకి కుడివైపున గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంతకుమార్, పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రులు టీ హరీశ్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉంటారు.

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5.15గంటలకు నగరంలోని ఎల్బీస్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన మహా సమ్మేళనం సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మహా సమ్మేళనం సభలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై 28 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేశారు.

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ప్రధానిగా తొలిసారి తెలంగాణకు: మోడీపై కేసీఆర్ ఆశలు

ఈ 28 మందిలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు చోటు దక్కలేదు. ఈ సభలో ప్రధాని మోడీ టిఆర్‌ఎస్‌పై బీజేపీ నేతగా ఏం విమర్శలు చేస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ మహా సమ్మేళనం సభలో ప్రసంంగించిన తర్వాత సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

English summary
Prime Minister Narendra Modi to embark on his maiden visit to newly formed state Telangana on August 7. During his much awaited and politically significant trip PM Modi will launch the state's flagship piped drinking water program 'Mission Bhagiratha' apart from launching various other developmental projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more