చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కు షాక్ ఇచ్చిన స్టాలిన్ ... ఫెడరల్ ఫ్రంట్ లో చేరం .. మీరే మా కూటమిలో చేరండి

|
Google Oneindia TeluguNews

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్నారు. దేశంలో మోడీ, రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఉండాలని భావిస్తున్న కేసీఆర్ నిదానంగా పావులు కదుపుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా మళ్లీ చర్చలు మొదలు పెట్టిన తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం చెన్నై వెళ్ళారు.

సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలుసీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలు

ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ ను కోరిన కేసీఆర్

ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ ను కోరిన కేసీఆర్

లోక్ సభ ఎన్నికల అనంతరం ఇటీవలే కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి మద్దతు కోరారు సీఎం కేసీఆర్ . ఇప్పుడు తాజాగా సోమవారం డీఎంకే చీఫ్ స్టాలిన్ ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సుమారు ఇరువురు నేతల మధ్య గంటన్నర పాటు చర్చ జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చెప్పి, జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ వస్తే ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటాయని చెప్పి ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది.

కేసీఆర్ ప్రతిపాదన తిరస్కరించిన స్టాలిన్ .. కేసీఆర్ నే బీజేపీయేతర కూటమికి మద్దతు ఇవ్వాలని ఆహ్వానం

కేసీఆర్ ప్రతిపాదన తిరస్కరించిన స్టాలిన్ .. కేసీఆర్ నే బీజేపీయేతర కూటమికి మద్దతు ఇవ్వాలని ఆహ్వానం

అయితే కేసీఆర్ ప్రతిపాదనను స్టాలిన్ తిరస్కరించారు. తాము బీజేపీయేతర కూటమిలో ఉన్నామని , అవకాశం ఉంటే తమరు కూడా బీజేపీయేతర కూటమిలో చేరాలని , తమ మద్దతు ప్రకటించాలని స్టాలిన్ కేసీఆర్ ను కోరారు. దీంతో కేసీఆర్ కు స్టాలిన్ పెద్ద షాక్ ఇచ్చినట్టు అయ్యింది. డీఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయని అంతేకాకుండా తాము బీజేపీ యేతరకూటమికి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారట స్టాలిన్ . సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని తేల్చి చెప్పారట.

కాంగ్రెస్ విషయంలో తమ వైఖరి మారబోదని స్పష్టం చేసిన స్టాలిన్

కాంగ్రెస్ విషయంలో తమ వైఖరి మారబోదని స్పష్టం చేసిన స్టాలిన్

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తికి మద్దతిస్తామని చెప్పారట స్టాలిన్ , అయితే కాంగ్రెస్ విషయంలో తమ వైఖరి మారబోదని తేల్చిచెప్పినట్లు డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ స్టాలిన్ మాత్రం తమ పూర్తి మద్దతు కాంగ్రెస్ కే అని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు దశల వారీగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్ త్వరలోనే కర్ణాటక సీఎం కుమారస్వామితోనూ కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎన్నికలు ముగింపు దశకు చేరుతున్న సమయంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు

ఎన్నికలు ముగింపు దశకు చేరుతున్న సమయంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న నేపధ్యంలో అటు బీజేపీయేతర కూటమి, ఇటు ఫెడరల్ ఫ్రంట్ వ్యూహాలతో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టే యత్నం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాలు పర్యటిస్తూ ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Telangana Rashtra Samiti chief K Chandrashekhar Rao's bid to rope in DMK in his proposed alternative front appeared to be a non-starter with the Dravidian party chief MK Stalin urging the Telangana Chief Minister to extend TRS's support to the Congress.Continuing his efforts to bring together regional parties, Rao called on Stalin at his residence here and discussed with him his proposal for a federal front, DMK sources said.In the meeting that went beyond an hour, Stalin conveyed to Rao that his party was in a pre-poll alliance with the Congress and he had also pitched the name of Rahul Gandhi for the office of the Prime Minister."Thalaivar (Stalin) urged Rao to extend Telangana Rashtra Samiti's support for a Congress-led government at the Centre," DMK sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X