రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వల్లే 27 మంది మృతి: తలసాని, ఏపీ నుండి భక్తులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పులమీద తప్పులు చేస్తున్నారని తెలంగాణ వాణిజ్య, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లాలో పుష్కరస్నానం చేసి పాల్వంచలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి పుష్కరాల్లో 27 మంది భక్తుల మృతికి చంద్రబాబే కారకుడన్నారు. వీఐపీ ఘాట్‌లో స్నానం చేయకుండా కేవలం జనరల్ ఘాట్‌లో స్నానంతో పాటు పుష్కరాల ప్రచారం కోసం షార్ట్‌ఫిల్మ్‌ను చిత్రీకరణ చేస్తున్నందువల్ల ఆ దుర్ఘటన జరిగిందన్నారు.

తెలంగాణలో ఎక్కడికక్కడ పకడ్బందీగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరాల ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పక్కా ప్రణాళికలు రూపొందించారన్నారు.

తలసాని

తలసాని

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాల్లో 27 మంది భక్తుల మృతికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని తెలంగాణ మంత్రి తలసాని ఆరోపించారు.

బిజెపి నేతల పుష్కర స్నానం

బిజెపి నేతల పుష్కర స్నానం

తెలంగాణలో గోదావరి మహా పుష్కరాలు కుంభమేళాను తలపిస్తున్నాయి. కందకుర్తి సంగమ స్థానం మొదలుకుని.. భద్రాద్రి రామయ్య పాద సాన్నిధ్యం వరకూ జల గోదావరి కాస్తా జన గోదావరిగా మారిపోతున్నది.

పుష్కరాల్లో బిజెపి నేతలు

పుష్కరాల్లో బిజెపి నేతలు

సెలవు రోజులు కావడంతో దాదాపు వందల కిలోమీటర్ల మేర రోడ్ల పైన జన సందోహమే కనిపించింది. పుష్కర ఘాట్‌లన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

సమీప దైవక్షేత్రాలు భక్తకోటి భగవన్నా మస్మరణతో మారుమోగిపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన పుష్కరాల్లో ఆదివారం నాటికి ఆరు రోజుల వ్యవధిలో దాదాపు కోటీ 81లక్షల మంది పుష్కర స్నానం చేశారని అంచనా.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

శనివారం 62 లక్షలమంది భక్తులు స్నానాలు చేయగా, ఆదివారం అంతే స్థాయిలో 61 లక్షల మంది భక్తులు వచ్చారు. అంటే సగం రోజులు కూడా పూర్తికాకముందే దాదాపు సగం తెలంగాణ జనాభా పుష్కరాల్లో పునీతమైంది. వీరికి తోడు రాష్ట్ర సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తెలంగాణ నదీక్షేత్రాలకు వచ్చి పుణ్యస్నానాలు చేశారు.

English summary
Stampede at Godavari Pushkaralu: Talasani slams Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X