హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీపైనే ప్రజల ఆశలు, ఒత్తిళ్లకు తలొగ్గొద్దు: యువ ఐఏఎస్‌లకు గవర్నర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ‘సమాజంలో మీరు ఓ బాధ్యత గల అధికారులుగా వ్యవహరించబోతున్నారు. ప్రజలు మీపై చాలా ఆశలు పెట్టుకుంటారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది' అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అఖిల భారత సర్వీసుల యువ అధికారులను ఉద్దేశించి అన్నారు. అఖిలభారత సర్వీసు ఉద్యోగులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలని అన్నారు.

కిందిస్థాయి అధికారులను కలుపుకొని ముందుకెళ్లడంతోపాటు క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వృత్తిలో నిజాయతీ, సమగ్రత ఎంతోముఖ్యమని, మొదటి పన్నెండేళ్లు కీలకమని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం 2012-2013 బ్యాచ్‌కు చెందిన అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులు, ఇండియన్ స్టాటిస్టికల్, ఇండియన్ ఎకనామిక్, ఇండియన్ పోస్టల్ వంటి 12 సర్వీసులకు చెందిన 141 మంది అధికారులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫౌండేషన్ కోర్సుల శిక్షణను గవర్నర్ సోమవారం ప్రారంభించారు.

14 వారాలపాటు జరిగే ఈ శిక్షణలో 40 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. మొత్తం శిక్షణలో రెండు వారాల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటన, శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

గవర్నర్ నర్సింహన్

గవర్నర్ నర్సింహన్

‘సమాజంలో మీరు ఓ బాధ్యత గల అధికారులుగా వ్యవహరించబోతున్నారు. ప్రజలు మీపై చాలా ఆశలు పెట్టుకుంటారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది' అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అఖిల భారత సర్వీసుల యువ అధికారులను ఉద్దేశించి అన్నారు.

యువ ఐఏఎస్‌లకు గవర్నర్

యువ ఐఏఎస్‌లకు గవర్నర్

అఖిలభారత సర్వీసు ఉద్యోగులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలని అన్నారు.

యువ ఐఏఎస్‌లకు గవర్నర్

యువ ఐఏఎస్‌లకు గవర్నర్

కిందిస్థాయి అధికారులను కలుపుకొని ముందుకెళ్లడంతోపాటు క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వృత్తిలో నిజాయతీ, సమగ్రత ఎంతోముఖ్యమని, మొదటి పన్నెండేళ్లు కీలకమని పేర్కొన్నారు.

యువ ఐఏఎస్‌లకు గవర్నర్

యువ ఐఏఎస్‌లకు గవర్నర్

జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం 2012-2013 బ్యాచ్‌కు చెందిన అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులు, ఇండియన్ స్టాటిస్టికల్, ఇండియన్ ఎకనామిక్, ఇండియన్ పోస్టల్ వంటి 12 సర్వీసులకు చెందిన 141 మంది అధికారులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫౌండేషన్ కోర్సుల శిక్షణను గవర్నర్ సోమవారం ప్రారంభించారు.

యువ ఐఏఎస్‌లకు గవర్నర్

యువ ఐఏఎస్‌లకు గవర్నర్

నేడు మీడియా చాలాక్షుణ్ణంగా మనల్ని గమనిస్తోందన్నారు. తాను ఎప్పుడైనా అవసరం ఉండి వాహనాన్ని వేగంగానడపాలని డ్రైవరుకు సూచిద్దామనుకొంటే... వేగంగా పరుగులు తీసిన గవర్నర్‌ వాహనమంటూ మీడియా మిత్రులు ప్రసారం చేసే అవకాశం ఉందని నవ్వుతూ చెప్పారు.

తాను 1960ల్లో సర్వీసులోకి వచ్చానని అందువల్ల తనది పురాతన కాలం నాటి అనుభవమని... అది నేటి యువతరానికి గడువు ముగిసినదిగా కనిపిస్తుందంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నేడు మీడియా చాలాక్షుణ్ణంగా మనల్ని గమనిస్తోందన్నారు. తాను ఎప్పుడైనా అవసరం ఉండి వాహనాన్ని వేగంగానడపాలని డ్రైవరుకు సూచిద్దామనుకొంటే... వేగంగా పరుగులు తీసిన గవర్నర్‌ వాహనమంటూ మీడియా మిత్రులు ప్రసారం చేసే అవకాశం ఉందని నవ్వుతూ చెప్పారు.

పౌర సమాజంలో ఉంటున్న అధికారులు కచ్చితంగా నైతిక విలువలు కలిగి ఉండాలన్నారు. వృత్తిలో గ్రామీణస్థాయి పరిశోధన ఎంతో ముఖ్యమన్నారు. కాగితాల్లో ఉండే లెక్కలు చాలావరకు మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పోలీసుశాఖ నేర పరిశోధనలో 90శాతం కేసులు పరిష్కారమైనట్లు ఉంటుందని, లోతుకు వెళ్లి చూస్తే చిన్నచిన్న కేసులు పరిష్కారమై అసలైనవి అలానే ఉండిపోతాయని ఉదహరించారు.

‘సమావేశాలు, కంప్యూటర్లు, గుగూల్ మ్యాప్‌లు, సెర్చ్‌లతో బిజీబిజీగా ఏసీ గదులకే పరిమితం కావద్దు. కేవలం గణాంకాలపైనే ఆధారపడొద్దు, ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలి. ఫీల్డ్ అనుభవం లేకపోతే మీరు ఏమీ సాధించలేరు' అంటూ వారికి హితబోధ చేశారు.

విద్యావిధానంలో మనం ఎంతోవెనుకబడి ఉన్నామన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి వచ్చే చాలామంది సహాయకులు (ప్యూన్‌లు)గా, కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నేటిరోజుల్లో కళాశాలలు వ్యాపారంగా మారాయన్నారు.
సమాచారహక్కు చట్టం సదుద్దేశంతో ఏర్పాటు చేసిందని.. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ వినోద్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. 14వారాల ఈశిక్షణలో వివిధ అంశాలతోపాటు పీటీ, యోగా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, గోల్ఫ్‌ తదితరాలను జత చేసినట్లు తెలిపారు. అదనపు డైరెక్టర్‌ జనరల్‌, శిక్షణ నిర్వాహకులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

English summary
Civil servants should stand by their conviction at the face of civil society protests, said Governor E.S.L. Narasimhan here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X