జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోతుల నుంచి కాపాడిన కుక్కను మరిచిపోలేదు: విగ్రహం పెట్టాడు

కుక్కలు మనుషుల పట్ల విశ్వాసంతో ఉంటాయని చూసాం.విన్నాం. కానీ మనుషులు కూడ అదే కుక్కల పై విశ్వాసంగా ఉంటారని ఈ స్టోరి చూస్తె తెలుస్తుంది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కుక్కలు మనుషుల పట్ల విశ్వాసంతో ఉంటాయని చూసాం.విన్నాం. కానీ మనుషులు కూడ అదే కుక్కల పై విశ్వాసంగా ఉంటారని ఈ స్టోరి చూస్తె తెలుస్తుంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్ గ్రామానికి చెందిన గంగారాం తనకు చేదోడుగా ఉంటుందన్న ఉద్దెశంతో ఓ శునకాన్ని పెంచుకున్నాడు.

ఆ శునకానికి రోజు ఆహారం తినిపిస్తూ తన పంటపొలాల వద్దకు తీసుకెళ్లెవాడు.ఓ రోజు గంగారం తోటలో ఉన్నప్పుడు వానరాల గుంపు అతనిపై ముకుమ్మడిగా దాడి చేశాయి, అక్కడె ఉన్న శునకం తన యజమానికి ఆపద వచ్చిందని గ్రహించి ఆ వానరాలపై అరవటం మొదలు పెట్టింది, కంగారుపడ్డ వానరాలు అక్కడి నుండి వెళ్లిపోయాయి.

Statue for Dog in Jagityal district

స్వల్ప గాయాలతో ఇంటికి వచ్చిన గంగారాం తన ప్రాణాలను తన కుక్క కాపాడిందని తన కుటుంబం సభ్యుల తో చెప్పాడు. గంగారాం వయసు పై బడటంతో అనారోగ్యం క్షీణించింది. గంగారాం ను చూసి ఆ శునకం కన్నీరు కార్చటం అతని మనసును కదిలించింది.ఆ శునకం యజమాని అనారోగ్యం చూడలేక మనస్తాపానికి గురిచెంది మరణించింది.

దాంతో తన శునకం శారీరకంగా లెకున్నా కలకాలం కనిపించాలన్న ఉద్దేశ్యము తో అతని ఇంటి ముందు "శునకానికి" విగ్రహం కట్టించాడు.తాను మరణిస్తె మరణించిన రోజు నన్ను ఎలాగైతె గుర్తుచేసుకుంటారో ఆ శునకాన్నీ కుడ గుర్తుచేసుకోవాలని ఆ రోజు శునకవిగ్రహాం వద్ద పూజలు నిర్వహించాలని చెప్పి మరణించాడు.

English summary
A man in Jagityal district of Telangana erected statue for dog,which saved himfrom th attack of Monkeys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X