వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: ఆ ఎంపీల పేర్లు చెప్పని స్టీఫెన్‌సన్, ఆ మాట సెబాస్టియన్‌ది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో కొత్త ట్విస్ట్! ఈ వ్యవహారంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తన వాంగ్మూలంలో ఇద్దరు ఎంపీల పేర్లు పేర్కొనలేదని తెలుస్తోంది.

ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్‌ది కీ రోల్ అని స్టీఫెన్ సన్ పేర్కొన్నారని తెలుస్తోంది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ బ్యాంకు అకౌంట్ నుండి రూ.50 లక్షలు తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిని సీఎం రమేష్ కొట్టి పారేశారు.

స్టీఫెన్ సన్ కూడా తన వాంగ్మూలంలో ఎంపీల పేర్లను చెప్పలేదు. ఈ కేసులో సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన రావుల పేర్లు వినిపించాయి. కానీ, ఆయన తన వాంగ్మూలంలో వారి పేర్లు చెప్పలేదని తెలుస్తోంది.

Stephenson did not name Telugu Desam MPs

చంద్రబాబు గొంతుగా భావించే వీడియోలో తొలుత మాట్లాడింది సెబాస్టియన్!

స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులు విడుదలైన విషయం తెలిసిందే. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడే కంటే ముందు స్టీఫెన్‌తో మాట్లాడింది ఎవరనే చర్చ వచ్చింది. అయితే, తొలుత మాట్లాడింది సెబాస్టియన్ అని చెప్పినట్లుగా సమాచారం. రేవంత్ కేసులో సెబాస్టియన్ కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారని తెలుస్తోంది.

English summary
MLA Elvis Stephenson’s statement in the cash-for-vote case revealed that Bishop Harry Sebastian played a key in the entire episode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X