హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొగ తాగడం మానేయండి.. లేక పోతే గుండే విశ్రాంతిని కోరుకుంటుందట..! జర బద్రం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ధూమపానం వల్ల కలిగే అనర్ధాల గురించి అనేక కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు కూడా పొగ పీల్చడం వల్ల కలిగే నష్టాలను ఏకరువుపెడుతూనే ఉన్నారు. ఐనా మంచి మాటలను చెవులకు ఎక్కించుకునే వారికన్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువ. ధూమపానం తాగేవారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. సిగరెట్‌ తాగేవారికే కాకుండా వారి చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. సిగరెట్‌ తాగడం వల్ల ఈ సమస్యలు వస్తాయి అంటే ఎవరూ వినకపోవచ్చు కానీ.. మానేయడం వల్ల ఈ లాభాలున్నాయంటే వింటారు. అందుకే ధూమపానం మానేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

పొగ మానేస్తే అన్నీ లాభాలే..! ముఖ్యంగా క్యాన్సర్ రాదంటున్న డాక్టర్లు..!!

పొగ మానేస్తే అన్నీ లాభాలే..! ముఖ్యంగా క్యాన్సర్ రాదంటున్న డాక్టర్లు..!!

యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లెక్కల ప్రకారం 80% కంటే ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలకు ధూమపానం కారణమని తేలింది. సిగరెట్లలో 70కి పైగా హానికరమైన క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉంటాయి. ధూమపానం మానేసిన తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ధూమ పానం వల్ల కలిగే అనర్థాల కన్నా ఉపయోగాలు తెలికపోడంతో అనేక మంది పొగతాగాడాన్ని ఫాషన్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

శ్వాసకు ఇబ్బందులు ఉండవు...! గుండెపోటు లాంటి సమస్యలు తగ్గుతాయి..!!

శ్వాసకు ఇబ్బందులు ఉండవు...! గుండెపోటు లాంటి సమస్యలు తగ్గుతాయి..!!

ధూమపానం చేయడం ద్వారా కఫం, దగ్గు ఎక్కువగా ఉంటుంది. వాయుమార్గాలలో శ్లేష్మం ఉత్పత్తి పెరుగుతుంది. పొగ మానేయడం వల్ల కొన్ని వారాల్లో దగ్గు, కఫం తగ్గుతుంది. శ్లేష్మం తక్కువగా ఉంటుంది. అందువల్ల శ్వాస బాగా తీసుకోగలుగుతారు. ధూమపానం మన శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ధూమపానం మానడం వలన గుండెపోటు, గుండె సమస్యలు వంటివి తగ్గుతాయి. ఆక్సిజన్ తీసుకోవడం మరింత మెరుగవుతుంది, శరీరంలో మంట తగ్గుతుంది

ఇన్‌ఫెక్సన్‌ వచ్చే అవకాశాలు తక్కువ..! సైడ్ ఎఫెక్ట్ జీరో..!!

ఇన్‌ఫెక్సన్‌ వచ్చే అవకాశాలు తక్కువ..! సైడ్ ఎఫెక్ట్ జీరో..!!

ధూమపానం చేసే వారి కంటే చేయని వారి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ఫన్‌ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ధూమపానం చేసేవారికి క్యాన్సర్, హృదయ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఆందోళన కలిగిస్తాయి. దీనికి ప్రస్తుతం మందులు లేవు. పొగాకు హానికరమైన ప్రభావాలను నిరోధించే చికిత్స లేదు. ఒక వ్యక్తి ధూమపానం మానేసిన తరువాత కూడా కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి.

Recommended Video

ఏసీబీ వలకు చిక్కిన కానిస్టేబుల్
హృదయ స్పందన క్షేమంగా ఉంటుంది..! ఊపిరి తిత్తులు దెబ్బతినడం ఉండదు..!!

హృదయ స్పందన క్షేమంగా ఉంటుంది..! ఊపిరి తిత్తులు దెబ్బతినడం ఉండదు..!!

నికోటిన్ హృదయ స్పందన రేటును పెంచే ఉద్దీపన పదార్థం. అంటే సిగరెట్లు తాగేవాళ్ల నాడి వేగంగా కొట్టుకుంటుంది. తాగడం మానేసిన తర్వాత నాడి కొట్టుకోవడం నెమ్మదిస్తుంది. తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటుంది. గుండెలో మంటని నికోటిన్‌ ప్రేరేపిస్తుంది. కాబట్టి ఆ మంట కూడా త్వరగా తగ్గిపోతుంది. ధూమపానం మానేసినట్లయితే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఉదాహరణకు 10 సంవత్సరాల పాటు ధూమపానం మానేసినట్టయితే, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఐదేళ్ల క్రితం మానేసిన దానికంటే తక్కువగా ఉంటుంది.

English summary
Smoking can have serious effects on the health of drinkers. Not only cigarette smokers, but also the health of those around them. Cigarette smoking causes these problems. So let's find out what the benefits of quitting smoking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X