• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిజామాబాద్ లో ఆగిన డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు..! నిధులు లేవంటున్న అదికారులు..!!

|

నిజామాబాద్/హైద‌రాబాద్ : జిల్లాలోని బీబీపేట మండలం యాడారంలో నిర్మించిన డీఫ్లోరైడ్‌ తాగునీటి సరఫరా పథకం ఆగిపోయింది. సమృద్ధిగా నీటి వనరులు, విద్యుత్తు సౌకర్యం, పంపిణీ చేసేందుకు మోటార్లు, సరఫరా చేసేందుకు పైప్‌లైన్లు, శుద్ధి చేసేందుకు ఫిల్టర్‌ బెడ్లు.. ఇలా సకల సౌకర్యాలున్నా ప్రాజెక్టు మాత్రం పడకేసింది. అలాగే దీని న‌ర్వాహ‌ణ ను పట్టించుకునే వారు కరవయ్యారు. ఏడాదిన్నర క్రితం ఆధునీకరణ కోసం ప్రభుత్వం 2 కోట్ల నిధులు మంజూరు చేసింది. 19 కోట్లతో ఉమ్మడి దోమకొండ మండలంలోని 19 గ్రామాలకు ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించేందుకు బీబీపేట మండలం యాడారం శివారులోని కూడెళ్లి వాగు(మానేరు)లో 2001లో అప్పటి ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. యుద్ధప్రాతిపదికన రెండు సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు, పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి చేశారు అదికారులు.

నిర్వహణ నిధులు లేక పనిచేయని ప్రాజెక్టు..! చేతులెత్తేసిన కాంట్రాక్ట‌ర్..!!

నిర్వహణ నిధులు లేక పనిచేయని ప్రాజెక్టు..! చేతులెత్తేసిన కాంట్రాక్ట‌ర్..!!

అన్నీ సక్రమంగా ఉండడంతో తాగునీటి పంపిణీని సైతం ప్రారంభించి, నిర్వహణ కోసం కాంట్రాక్ట‌ర్ ను నియమించారు. నీటిని శుద్ధి చేయడంతో పాటు నిర్వహణకు ఏటా కొంత మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అయితే నాలుగు నెలల పాటు గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసై కార్య‌క్ర‌మానికి స్వ‌స్తి ప‌లికారు. ఆ త‌ర్వాత నెల‌కొన్న వ‌ర్షాభావ ప‌రిస్థితుల వ‌ల్ల మానేరులో నీటి వనరులు లేక తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అయితే 2015 వరకు నిధులు స‌క్ర‌మంగానే విడుదలయ్యాయి.

ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న 19గ్రామాల ప్ర‌జ‌లు..! ప్ర‌భుత్వం నిధులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి..!!

ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న 19గ్రామాల ప్ర‌జ‌లు..! ప్ర‌భుత్వం నిధులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి..!!

మొదటి నుంచి ఇప్పటి వరకు దీని బాధ్యతలను ఒక్కరే చేపడుతూ వ‌చ్చారు. దీన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఫిల్టర్ బెడ్లను శుభ్రపరిచారంటే నిర్వహణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మూడు ఫిల్టర్‌బెడ్లకు గాను ప్రస్తుతం ఒక్కటే మాత్రమే పనిచేస్తున్నది. గత్యంతరం లేని పరిస్థితిలోనే నీటిని వినియోగిస్తున్నామని యాడారం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

అదికారులు ద్రుష్టి సారించాలంటున్న గ్రామ‌స్తులు..! ప్రాజెక్టు ఆపొద్దంటున్న బాదితులు..!!

అదికారులు ద్రుష్టి సారించాలంటున్న గ్రామ‌స్తులు..! ప్రాజెక్టు ఆపొద్దంటున్న బాదితులు..!!

19 గ్రామాలకు గాను ప్రస్తుతం కేవలం ఒక్క గ్రామానికి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటం పట్ల పరిసర గ్రామాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత ఇన్ టేక్ వెల్ లో నీటి లభ్యత లేందంటూ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం 2 కోట్ల రూపాయ‌లు విడుదల చేసింది. అంచనా పెరిగిందని తెలియచేయడంతో మరో 50 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది.

కేంద్ర నిధులు అంద‌డం లేదంటున్న అదికారులు..!ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం వ‌ద్దంటున్న గ్రామ‌స్తులు..!!

కేంద్ర నిధులు అంద‌డం లేదంటున్న అదికారులు..!ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం వ‌ద్దంటున్న గ్రామ‌స్తులు..!!

ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులను నేరుగా పంచాయతీలకే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా జిల్లా ప్రజా పరిషత్‌, మండల పరిషత్‌లకు నిధుల విడుదల నిలిపివేశారు. నిధుల లభ్యత లేక స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ నిర్వహణను గాలికి వదిలేసారు. దీంతో పాటు ఏడాదిన్నర కాలం నుంచి నిధులు విడుదల చేయడం లేదు. నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Defloride Drinking Water Supply Scheme, which was constructed at the Bibi peta Mandalam yard in the Nizamabad district, stopped. The abundant water resources, power supply, motors to supply, pipelines to supply, filter beds to refine the project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more