హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శత్రు దేశాలకు వణుకు: ప్రధాని మోడీపై పవన్ కళ్యాణ్ ప్రశంలు, ఇంకా ఏమన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని.. తనవంతుగా సేవ చేయాలనే వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భారతమాత పిలుపు విని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని నక్లెస్‌రోడ్‌లో జరిగిన భారతమాత మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

మొదట.. చివరా.. భారతీయుణ్ణే..

మొదట.. చివరా.. భారతీయుణ్ణే..

తాను మొదట భారతీయుణ్ణి.. చివర కూడా భారతీయుణ్ణే అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే మనం జరుపుకునే ఈ సంబరాలని అన్నారు. తన తండ్రి చనిపోయినప్పుడు వారణాసిలో అస్థికలు కలపడానికి వెళ్లిన సమయంలో.. ముంబైలో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మూడు రోజులు దాడులు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తనను కలిచివేసిందన్నారు. ఆ తర్వాత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేశారని.. దేశ నేతలకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న మొదలైందన్నారు.

మోడీ బలమైన నాయకత్వంలో..

మోడీ బలమైన నాయకత్వంలో..

అప్పుడే తాను దేశానికి బలమైన నాయకత్వం కావాలని కోరుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను కోరుకుంటేనే నరేంద్ర మోడీ వచ్చారని చెప్పారు. పక్కదేశాలు భారత్ వైపు చూడాలనుకుంటే భయపడి పోవాలని కోరుకున్నానని.. ఇప్పుడు మోడీ నాయకత్వంలో దేశం బలంగా మారిందన్నారు.

శత్రుదేశాలకు వణుకు..

శత్రుదేశాలకు వణుకు..

బలమైన నాయత్వం ప్రధాని నరేంద్ర మోడీదని, ఆయన లాంటి నేతల చేతిలో దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. శత్రుదేశాలను గజగజ వణికించే శక్తి ఆయనకుందని అన్నారు. ప్రభావితం చేసే, దేశాన్ని రక్షించే నాయకత్వం కావాలి.. అది బీజేపీలో, దాని అనుబంధ సంస్థలో ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మోడీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు..

మోడీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు..

2014లో తెలంగాణలో జనసేన ఆవిర్భావ సమయంలో నరేంద్ర మోడీ కలవమంటే తాను కలిశానని చెప్పారు. మోడీ లాంటి వ్యక్తి నాయకత్వం దేశానికి అవసరమనే తాను బీజేపీతో కలిశానని తెలిపారు. మనం పెట్టుకున్న నమ్మకాన్ని మోడీ వమ్ము చేయలదేని.. ఇప్పటి వరకు మనపై దాడులు జరగలేదని, బాంబులు లేవని అన్నారు. దేశ రక్షణ కోసం మోడీ లాంటి నాయకత్వం కావాలని కోరుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశం కోసమే తాను ఎలాంటి షరతులు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని పవన్ కళ్యాన్ స్పష్టం చేశారు. దేశ సేవలో కర్పూరంలా కరిగిపోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

పాక్‌లో అరాచకాలు.. సీఏఏపై..

పాక్‌లో అరాచకాలు.. సీఏఏపై..

గరికపాటి సీఏఏపై మాట్లాడారని గుర్తు చేశారు. అంబేద్కర్‌ను మనమంతా గుండెల్లో పెట్టుకుంటామని, గౌరవిస్తామని అన్నారు. పాకిస్తాన్‌లో మాత్రం ఆ దేశంలో మొదటి లా మినిష్టర్ అయిన దళిత నాయకుడికి దారుణమైన అన్యాయం జరిగిందన్నారు. ఆ దళిత నేత కుటుంబసభ్యులను ఊచకోత కోసి, మహిళలపై దారుణాలకు పాల్పడ్డారని.. దీంతో ఆయన మనదేశంకు వచ్చి ఇక్కడే ఉండిపోయారని తెలిపారు. పాకిస్థాన్‌లో హిందువులకు రక్షణ లేదని.. అందుకే సీఏఏ అవసరం ఉందన్నారు.

మనదేశంలో ఊచకోత కోస్తామనే సెక్యూలరిజం..

మనదేశంలో ఊచకోత కోస్తామనే సెక్యూలరిజం..

మనదేశంలో మాత్రం 15 నిమిషాల్లో హిందువులను ఊచకోత కోస్తామనే సెక్యూలరిజం ఉందని పరోక్షంగా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. భారత మాత సేవలో తాను కర్పూరం కరిగిపోవాలనేదే తన కోరిక అని ఆయన అన్నారు. భారత్ మాతా కీ జై అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు. తన మెడ మీద కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అనను అని ఓ వ్యక్తి అన్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తాను భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నానని తెలిపారు. భారత్ మాతా కీ జై అని అందరితో అనిపిస్తామని చెప్పారు. మహా హారతి కార్యక్రమంలో గవర్నర్ తమిళసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, అష్టావధాని గరికపాటి నరసింహారావు, తదితరలు పాల్గొన్నారు.

English summary
Strong leadership: pawan kalyan praises PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X