సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేయని నేరానికి చితకబాదిన ప్రిన్సిపాల్: కాలేజీపై నుంచి దూకిన విద్యార్థిని

చేయని నేరానికి ప్రిన్సిపాల్ చితకబాదడంతో కాలేజీ భవనంపైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట: నిజానిజాలు తెలుసుకోకుండా ఓ విద్యార్థినిపై వచ్చిన దొంగతనం ఆరోపణకు ఊగిపోయిన ఓ కాలేజీ ప్రిన్సిపాల్.. సదరు విద్యార్థినిని తోటి విద్యార్థుల ముందే చితకబాదాడు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర అవమానానికి గురైంది. కొద్దిసేపటికే అదే కాలేజీ భవనంపై నుంచి దూకి ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సాయిచైతన్య జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట మండలం పుల్లూరుకు చెందిన ఎర్రోళ్ల భవాని(18) సిద్దిపేట పట్టణంలోని సాయి చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ రెండోసంవత్సరం చదువుతోంది. ఆమె చెల్లి శివాని కూడా ఇదే కాలేజీలో చదువు తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రతి రోజూ బస్సులో కాలేజీకి వచ్చి చదువుకుంటున్నారు.

బుధవారం కళాశాలలో ఓ అమ్మాయి తన రూ.100 నోటు పోయిందని, భవానే తీసి ఉండొచ్చని ప్రిన్సిపల్‌ బ్రహ్మానందరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన భవానిని తన చాంబర్‌కు పిలిచి తీవ్రంగా కొట్టారు. తోటి విద్యార్థుల ముందు దొంగగా చిత్రీకరించి రూ.100 ఆమెతో ఇప్పించారు. ఆ డబ్బులు తనవే అని, బస్‌ పాస్‌ కోసం తెచ్చుకున్నానని భవాని ఎంతగా చెప్పినా ప్రిన్సిపల్‌ వినిపించుకోలేదు.

Student commits suicide at college

భవాని ఇంటికి వెళ్లాక జరిగిన విషయం తన తల్లిదండ్రులతో చెప్పి ప్రిన్సిపల్‌ను నిలదీయా లని కోరింది. తండ్రి వెంకటి కూతురికి సర్దిచెప్పి బస్‌పాస్‌ కోసం మరో రూ.100 ఇచ్చి గురువారం కాలేజీకి పంపించాడు. ప్రిన్సిపల్‌ మరోసారి తన చాంబర్‌లోకి పిలిపించుకొని భవానిని మందలించడంతో అదే కాలేజీ భవనం నాలుగో అంతస్థుకు ఎక్కి దూకింది. ఆమెను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. భవాని మృతదేహా న్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ప్రిన్సిపల్‌ మాత్రం భవాని బిల్డింగ్‌పై నుంచి జారిపడిందని తండ్రికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకు నేటప్పటికే భవాని మరణించడంతో వారి రోదనలు మిన్నంటాయి. అంతేగాక, బాలికకు 'లవ్‌ ఎఫైర్‌' అంటగట్టేం దుకు ప్రిన్సిపల్‌ ఒడిగట్టారు.

విద్యార్థులు తిరగబడటంతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాలిక ప్రాణానికి యాజమాన్యం రూ.7 ల క్షల నష్టపరిహారమిచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం, ప్రిన్సిపల్‌ వేధింపులే భవాని మృతికి కారణమంటూ విద్యార్థి సంఘాలు డీఐఈ వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాయి. గురువారం సాయంత్రం విద్యార్థిని తండ్రి వెంకటేశ్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, 'దొంగతనం నేరం మోపి నందూసార్‌ (ప్రిన్సిపల్‌) అక్కను కొట్టిండు. అక్క ఎలాంటి తప్పు చేయలేదు. నందూ సార్‌ కొట్టడంతోనే కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకింది' అని మృతు రాలి సోదరి శివాని కన్నీళ్లు పెట్టుకుంది.

డీఐఈఓ విచారణ

ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో విద్యార్థిని మృతిపై జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (డీఐఈవో) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులపై వారికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

English summary
E. Bhavani, a 17-year-old intermediate student and native of Pullur village in Siddipet Rural mandal, has committed suicide by jumping from a building as she was beaten up by college principal Brahmananda Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X