వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవనంలోకి వచ్చిన దుండగులను ఎదిరించి ప్రశ్నించి, ప్రాణాల మీదికి తెచ్చుకొంది

ఖైరతాబాద్ లోని రాజానగర్ మక్తాలో నివాసం ఉండే నాగలక్ష్మి అనే బిటెక్ ప్రథమ సంవత్సరం చదివే విధ్యార్థినిని ఐదవ అంతస్థు నుండి గుర్తు తెలియని దుండగులు తోసేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. మొదటి అంతస్థు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఖైరతాబాద్ :భవనంలోకి ఆగంతకులు ప్రవేశించారు. వారిని చూసిన ఆ విధ్యార్థిని భయపడలేదు. ఎవరని ప్రశ్నిస్తూ వారిని వెంబడించింది. ఆమె వల్ల తమకు ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన దుండగులు ఆమెను ఐదంతస్తులు భవనం నుండి కిందకు తోసేశారు. ఈ ఘటనతో నాగలక్ష్మి అనే విధ్యార్థిని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చదువులో ముందుండే నాగలక్ష్మి ఈ ఘటనతో మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.

ఘట్ కేసర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో నాగలక్ష్మి బిటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె చదువులో ఎప్పుడూ ముందే ఉంటుంది.తల్లిదండ్రులు తమ జీవనోపాధి కోసం దుబాయికి వెళ్ళారు. దీంతో ఆమె తన మేనత్త ఇంటి వద్ద ఉంటూ చదువుకొంటుంది. రాజ్ నగర్ మక్తాలోని తన ఇంటి వద్ద ఉంటూ చదువుకొంటుంది.

బుదవారం తెల్లవారుజామున ఉదయం ఐదున్నర గంటల సమయంలో నిద్రలేచి మొదటి అంతస్థులోకి మంచినీళ్ళు తాగేందుకు వచ్చింది. అదే సమయంలో ఆమె ఐదో అంతస్థులోకి ఇద్దరు దుండగులు ప్రవేశించారు. వారిని చూసిన నాగలక్ష్మి ప్రశ్నించింది. ఎవరూ మీరని వెంబడించింది. అయితే వారు సమాధానం చెప్పకుండా తడబడ్డారు.ఐదు అంతస్థుల వరకు ఆమె దుండగులను వెంటాడింది.ఆమెను దుండగులు కిందకుతోసేశారు.

student injured ,unknown persons thrown student from fifth floor

ఆ దుండగలు ఎందుకు వచ్చారు

నాగలక్ష్మి ఉండే భవనం ైదు అంతస్థుల్లో ఉంటుంది. అయితే రెండో అంతస్థులో ఉన్న నాగలక్ష్మి మంచినీళ్ళు తాగేందుకు ఒకటో అంతస్థులోకి వచ్చే సమయంలో దుండగులు వెళ్ళడాన్ని గుర్తించింది. అయితే ఈ దుండగులు ఎందుకు వచ్చారు. ఎవరికోసం వచ్చాని పోలీసులు ఆరాతీస్తున్నారు. ధైర్యంగా దుండగులను ఎదిరించి ప్రశ్నించిన నాగలక్ష్మిని ఐదు అంతస్థుల భవనంనుండి కిందకు తోసేశారు.ఐదు అంతస్థులు భవనం నుండి ఆమెను కిందకు తోసేయడంతో శరీరంలోని పలు అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయి.

వెన్నెముకకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. కాళ్ళకు కూడ బలమైన దెబ్బలు తగిలాయి. వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె కాళ్ళలో స్పర్శను కోల్పొయింది. అయితే న్యూరోసర్జన్లు ఆమెకు శస్త్రచికిత్స చేయడం ద్వారా ఒ కాలులో కొంత స్పర్శ వచ్చింది. వెన్నెముకకు గాయాలు కావడం వల్ల ఆమె భవిష్యత్తులో వీల్ చైర్ కే పరిమితమయ్యే అవకాశం ఉందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

నాగలక్ష్మి నివాసం ఉంటున్న భవనం పరిసర ప్రాంతాల్లో ఉదయం ఐదు నుండి ఆరు గంటల మద్య ఎవరెవరు తిరిగారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీపంలోని సిసి కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలిసులు ప్రయత్నిస్తున్నారు. చదవుల్లో ఎప్పుడూ ముందుండే నాగలక్ష్మి దుండగుల కారణంగా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమె కోలుకొనేందుకు వైద్యులు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

English summary
nagalaxmi studying b.tech first year in a private college , her parents went to dubai for livelyhood. nagalaxmi stay with her relatives house rajnagar makta at kairatabad,thursday morning unknown persons came nagalaxmiis buiding, she identified some persons entered in to our building. she asked who are you, but they not replied, she went to behind them. unknown persons thrown her from the 5th floor. she is ijkured . she admitted in hospital,police enquiry above the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X