వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిరిజన హాస్టల్‌లో దారుణం.. విద్యార్థినిలకు ప్రెగ్నెన్సీ? ఒక్కరు కాదు ఇద్దరూ కాదు...

|
Google Oneindia TeluguNews

అదో గిరిజన బాలికల వసతిగృహం. అందులో ఉంటూ విద్యార్థినిలు చదువుకొంటున్నారు. అయితే కొందరు విద్యార్థినిలు గర్భవతులు అని తేలడం కలకలం రేపింది. పది మంది విద్యార్థినీలకు టెస్టులు చేయడం, కొందరికీ పాజిటివ్ రావడంతో సంచలనం కలిగించింది. రెండునెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

గర్భం దాల్చిన..

గర్భం దాల్చిన..

ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళ డిగ్రీ కాలేజీ హాస్టల్‌లో ఘటన జరిగింది. హాస్టల్‌లో ఉంటోన్న విద్యార్థినీలు గర్భం దాల్చారనే విషయం ఆందోళనకు గురిచేసింది. ఇటీవల పది మంది విద్యార్థినులకు డేట్ సరిగా రావడం లేదు. దీంతో హాస్టల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహంచారు.

 ముగ్గురికి పాజిటివ్..

ముగ్గురికి పాజిటివ్..

పదిమందిలో ముగ్గురికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో సిబ్బంది గజ గజ వణికారు. నెలరోజుల తర్వాత మరోసారి తీసుకొస్తే ముగ్గురిలో ఒక్కరే ప్రెగ్నెట్ అని వైద్యులు తెలిపారు. అమ్మాయి గర్భవతి కావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యువతిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

వివరాల సేకరణ

వివరాల సేకరణ

మిగతా విద్యార్థినులను ఆర్‌సీవో లక్ష్మయ్య వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగింది, ఎవరెవరు హాస్టల్‌కు వచ్చారనే అంశాలపై ఆరాతీస్తున్నారు. ఘటన జరిగి రెండునెలలవుతోన్నా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని హాస్టల్ సిబ్బందిపై జిల్లా ట్రైబ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చర్యలు తీసుకొండి

చర్యలు తీసుకొండి

హాస్టల్‌లో విద్యార్థిని గర్భం దాల్చడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగాయి. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. దీంతో విద్యార్థి సంఘం నేతలు శాంతించారు.

English summary
student pregnant in tribal hostel in asifabad district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X