వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాక్లెట్ దొంగిలించాడని విద్యార్థిపై దాడి, తీవ్రగాయాలతో మృతి, పేరెంట్స్ ఆందోళన..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. డీ మార్ట్ సిబ్బంది సతీశ్ అనే విద్యార్థిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో సతీశ్ అనే విద్యార్థి చనిపోయారు. సతీష్ చాక్లెట్ దొంగిలించారని డీ మార్ట్ సిబ్బంది ఆరోపిస్తోంది. విషయం తెలుసుకున్న సతీశ్ నాయక్ తండ్రి, లంబాబీ ఐక్య వేదిక.. వనస్థలిపురం డీ మార్ట్‌ను ముట్టడించారు. తమ కుమారుడిని ఎందుకు హతమార్చారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఇంటర్ సెకండ్ ఇయర్..

ఇంటర్ సెకండ్ ఇయర్..

సూర్యాపేటకు చెందిన సతీశ్ నాయక్ వనస్థలిపురంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితులతో కలిసి డీ మార్ట్‌కు వచ్చాడు. తనకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేశాడు. అయితే చాక్లెట్‌ను దొంగిలించాడని డీ మార్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. చాక్లెట్ తీసుకోవడం తప్పు అని దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలతో డీ మార్ట్ వద్దనే కుప్పకూలిపోయాడు. ఆదివారం రాత్రి 9.40 గంటలకు సతీశ్ చనిపోవడంతో పేరెంట్స్‌కు సమాచారం అందజేశారు.

డీ మార్ట్ వద్ద ఆందోళన

డీ మార్ట్ వద్ద ఆందోళన

సోమవారం ఉదయం సతీశ్ తండ్రి, లంబాడీ ఐక్యవేదిక డీ మార్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సతీశ్ తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప.. చేయి చేసుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకున్నారు. 12 గంటలు గడుస్తోన్న సతీశ్ మృతదేహాన్ని కూడా అప్పగించడం లేదని తెలిపారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

డీ మార్ట్ క్లోజ్..

డీ మార్ట్ క్లోజ్..

సతీశ్ నాయక్ తండ్రి ఆందోళనతో డీ మార్ట్ మూసివేశారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పోలీసులను మొహరించారు. కోపోద్రిక్తులైన లంబాడీలు డీ మార్ట్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రహదారిపై ఆందోళనకు దిగారు. శ్రీ చైతన్య యాజమాన్యంపై లంబాడీ నేతలు మండిపడ్డారు. లక్షలకు లక్షలు ఫీజు వసూల్ చేసే మేనేజ్ మెంట్ రాత్రి పూట ఎందుకు పంపించిందని అడిగారు. బయటకు పంపిస్తున్నామని పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారా అని అడిగారు.

Recommended Video

Pawan Kalyan Mass Entry At Yerrabalem || దేవుడు మన బాధ వింటున్నాడు! | Oneindia Telugu
ఇద్దరేసి చొప్పున బయటకు..

ఇద్దరేసి చొప్పున బయటకు..

విద్యార్థులను హాస్టల్ నుంచి ఎలా పంపించారని అడుగుతున్నారు. ఇద్దరు చొప్పున విద్యార్థులను హాస్టల్ నుంచి పంపించినట్టు రికార్డులో ఉంది. సతీశ్ సోదరులు, ఇతరులు డీ మార్ట్ సిబ్బందిపై ఆగ్రహంతో ఉన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే రాష్ట్రంలో ఉన్న డీ మార్ట్‌లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

English summary
student thief chocolate in vanasthalipuram shopping complex. workers attack student, sathish naik dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X