వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫుడ్ పాయిజన్: ఆహారం వికటించి నిట్ విద్యార్థుల అస్వస్థత

వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్‌లో చదువుతున్న బీటెక్, ఎంటెక్, ఎస్వోఎం విభాగాలకు చెందిన విద్యార్థులు క్యాంపస్ బయట ప్రయివేటు కేఫ్‌లో తినుబండారాలు తిని అవి వికటించడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్‌లో చదువుతున్న బీటెక్, ఎంటెక్, ఎస్వోఎం విభాగాలకు చెందిన విద్యార్థులు క్యాంపస్ బయట ప్రయివేటు కేఫ్‌లో తినుబండారాలు తిని అవి వికటించడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు ఇంటికి వెళ్లారు.

రెండు రోజుల క్రితం బుధవారం రాత్రి నిట్‌లోని ఎస్‌వోఎం విభాగానికి చెందిన విద్యార్థులు ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఓ కేఫ్‌కు వెళ్లారు. వేర్వేరు ఆహార పదార్థాలు ఆర్డర్‌ చేసి తిన్నారు. అనంతరం క్యాంపస్‌కు వెళ్లిన తర్వాత వాంతులు, విరేచనాలతో పాటు తీవ్ర జ్వరం వచ్చింది.

బుధవారం రాత్రి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరుసటి రోజు నిట్‌ అధికారులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఏడుగురిని రోహిణి ఆసుపత్రిలో చేర్పించారు. అదే కేఫ్‌లో ఆహారం స్వీకరించిన మరికొందరు విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.

Students of NIT fallen sick vomiting and fever due to consuming contaminated food

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై కదలలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. చికిత్స తర్వాత కోలుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువమంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు.

సిద్రా కేఫ్‌లో ఆహార నాణ్యత లోపించడంతోనే తాము అస్వస్థతకు గురయ్యామని వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా, విషయం తెలుసుకున్న నిట్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్యాం, సురేందర్‌, ఎంఎస్‌వో రాజారెడ్డిలు సిద్రా హోటల్‌పై దాడి చేసి ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు.

English summary
20 Students of National Institute of Technology at Warangal, fallen sick vomiting, diarrhea and fever due to consuming contaminated food at a local eatery in Kazipet on Wednesday night, on Thursday they were admitted in Rohini Hospital at Hanamkonda on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X