హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్ షాక్: హైదరాబాద్ ఇంజనీర్లు పనికిరారు, కారణమిదే..

దేశంలో కీలక నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతాలలో ఇంజినీరంగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్లతో పోలిస్తే హైదరాబాద్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు చాలా వెనుకబడి ఉన్నారని ఓ అధ్యనయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో కీలక నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతాలలో ఇంజినీరంగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్లతో పోలిస్తే హైదరాబాద్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు చాలా వెనుకబడి ఉన్నారని ఓ అధ్యనయం తేల్చింది.

హైదరాబాద్ విద్యార్థుల్లో ప్రోగ్రామింగ్ చేసే నైపుణ్యం చాలా తక్కువగా ఉందని ఆటో మేటా నేషనల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన గ్రాడ్యుయేట్లు 0.7 శాతం మంది మాత్రమే ప్రాథమికంగా కోడ్ రాసే శక్తిసామర్థ్యాలను కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది.

హైదరాబాద్‌ నుంచి వచ్చే ఫ్రెషర్స్‌లో నూటికి కనీసం ఒక్కరికి కూడా పూర్తిగా కోడింగ్‌ రావడం లేదని సర్వేలో తేలింది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నైలలో ఇంజనీర్లతో పోల్చితే హైదరాబాద్‌ ఇంజనీర్లకు ఉద్యోగాలు తక్కువగానే వస్తాయని తెలిపింది.

500 కళాశాలల్లో..

500 కళాశాలల్లో..

ఆటోమేటా ఇటీవల దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 500 కళాశాలల్లో 36 వేల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులపై అధ్యయనం చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందినవారే కోడింగ్‌లో అతి తక్కువ నైపుణ్యాలు ప్రదర్శించారని గుర్తించింది.

పొరపాటు

పొరపాటు

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ, బోధన లోపాలు కూడా ఉన్నట్లు తెలిపింది. కోడింగ్‌ రాయడంలో మాత్రమే కాకుండా ప్రోగ్రామింగ్‌ ప్రాక్టీస్‌, అల్గారిథమ్‌ను అర్థం చేసుకోవడంలోనూ హైదరాబాద్‌ విద్యార్థులు పొరపాట్లు చేస్తున్నారని అధ్యయనంలో పాల్గొన్న వారు చెప్పారని తెలుస్తోంది.

పరిశ్రమ డిమాండ్‌ని అందుకునే రీతిలో మన కళాశాలలు, యూనివర్సిటీల కంటెంట్‌ లేదని, దాన్ని కూడా కాలానికి తగినట్లు మార్చాల్సిన అవసరం ఉందని సాఫ్టువేర్ నిపుణులు అంటున్నారు.

ఇవీ కారణాలు..

ఇవీ కారణాలు..

కాగా, టెక్నికల్ ఇంటర్వ్యూలు నిర్వహించినప్పుడు తెలుగు ప్రెషర్స్‌కు ఆయా అంశాల్లో బేసిక్స్ పైన పూర్తిగా పట్టు ఉండటం లేదని అంటున్నారు. రకరకాల కోర్సులు చేసి ఉంటారని, కానీ ఎందులోను పట్టు సాధించరని అంటున్నారు. దీంతో టెక్నికల్ ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతుంటారని అంటున్నారు.

దీనిపై తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈవో సుజీర్ నాయుడు స్పందిస్తూ.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కాలేజీ స్థాయిలో ప్రత్యేక కోర్సులను ప్రారంభిస్తామని చెప్పారు.

ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే..

ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే..

కాగా, అమీర్‌పేట పేరు చెబితే చాలు వేల సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ సంస్థలు మదిలో మెదులుతాయి. పొరుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడకు వచ్చి రకరకాల కోర్సులు వేర్చుకుంటారు. కానీ మన వారు మాత్రం వెనుకబడుతున్నారు. ఒక ఉద్యోగం లేదా రంగాన్ని లక్ష్యం చేసుకొని కోచింగ్ తీసుకుంటే బాగుంటుందంటున్నారు.

English summary
According to the national daily, the study found that an abysmal 0.7 per cent of the candidates from the city were able to write functionally and logically correct code.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X