• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తట్టుకోలేక ఏడ్చేసిన సుబ్బరాజు?: బీపీ ఎందుకు డౌన్ అయింది.. విచారణ ఏ రేంజ్‌లో ఉందంటే?

|

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. మొన్న శ్యాం కె నాయుడు, నిన్న సుబ్బరాజు.. ఇద్దరూ సిట్ విచారణలో పూరి పేరునే కీలకంగా ప్రస్తావించారు. దీంతో డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటిదాకా వినిపిస్తున్న పేర్లలో.. పూరినే ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌: లిస్టు బయటపెట్టిన సుబ్బరాజు, వారికి చుక్కలేనా?ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌: లిస్టు బయటపెట్టిన సుబ్బరాజు, వారికి చుక్కలేనా?

నటుడు సుబ్బరాజు వెల్లడించిన విషయాలు దర్శకుడు పూరి జగన్నాథ్ ను మరింత ఇరకాటంలోకి నెట్టాయి. బ్యాంకాక్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పూరికి ఇచ్చానని నటుడు సుబ్బరాజు ఒప్పుకోవడంతో.. తనకు డ్రగ్స్ అలవాటు లేదని పూరి చేసిన వ్యాఖ్యలు అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు.

కాగా, విచారణలో చాలాసేపు కొరకురాని కొయ్యలా దేనికి సరైన సమాధానం చెప్పని సుబ్బరాజు.. విచారణ చివరి దశలో మాత్రం మాత్రం ఒత్తిడి తట్టుకోలేక నిజాలన్ని బయటపెట్టేశాడు. అంతేకాదు, ఒకానొక దశలో భోరమంటూ ఏడ్చాటంటే విచారణ ఏ రేంజ్ లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

సాయంత్రం దాకా అదే తీరు:

సాయంత్రం దాకా అదే తీరు:

శుక్రవారం ఉదయం 10గం.కు సిట్ ముందు హాజరైన సుబ్బరాజు.. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదు. సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణితో బుకాయిస్తూ వచ్చాడు. విచారణలో సిట్‌ అధికారులు శీలం శ్రీనివాసరావు, జి.శ్రీనివా‌సన్ లతో పాటు ఏఈఎస్‌ పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

  Tollywood Drugs Scandal : Top Hero And Heroine To Be Arrest - Oneindia Telugu
  వీడియోలు చూపించడంతో:

  వీడియోలు చూపించడంతో:

  విచారణ గంటలు గడుస్తున్నా.. సుబ్బరాజు నోటి నుంచి ఎలాంటి సమాధానలు రాకపోవడంతో.. ఇక లాభం లేదనుకున్న పోలీసులు.. పూర్తి సాక్ష్యాధారాలను ఆయన ముందు పెట్టారు. వీడియోలను చూపించి మరీ.. ఇదేంటి? అని ప్రశ్నించారు.

  ఆ వీడియోల్లో పూరి డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో సుబ్బరాజు ఆయన పక్కనే కూర్చుని ఉన్నారు. అప్పటిదాకా నిబ్బరంగా ఉంటూ వచ్చిన సుబ్బరాజు.. ఇక ఒత్తిడి తట్టులేక ఒక్కసారిగా భోరుమంటూ ఏడ్చేశాడు. నిజాలన్ని ఒప్పుకున్నాడు.

  అకున్ సబర్వాల్ ఎంట్రీ:

  అకున్ సబర్వాల్ ఎంట్రీ:

  సుబ్బరాజు దాటవేత ధోరణితో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేరుగా దిగడంతో విచారణ మరో మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. అందువల్లే సుబ్బరాజు ఒత్తిడికి లోనై ఉంటాడా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సబర్వాల్ ఎంట్రీ తర్వాత.. పూరికి తాను డ్రగ్స్ ఇచ్చినట్లు సుబ్బరాజు ఒప్పుకున్నాడు. బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చి పూరికి డ్రగ్స్ ఇచ్చినట్లు అంగీకరించాడు.

  ఇవీ ప్రశ్నలు:

  ఇవీ ప్రశ్నలు:

  కెల్విన్ తో మీకున్న సంబంధాలేంటి?.. పూరి గ్యాంగ్ లో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు?.. ఈ మొత్తం వ్యవహారం వెనుక దందా ఏమైనా కొనసాగుతోందా?.. ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు? వంటి ప్రశ్నలను సుబ్బరాజుకు సంధించారు అధికారులు. దీంతో చాలాసేపు సమాధానం చెప్పకుండా ఉండిపోయిన సుబ్బరాజు.. చివర్లో మాత్రం ఉక్కిరిబిక్కిరి కాక తప్పలేదు.

  సుబ్బరాజుకు 'బీపీ' డౌన్ అయిందంటే?:

  సుబ్బరాజుకు 'బీపీ' డౌన్ అయిందంటే?:

  సుబ్బరాజుకు ఏకంగా బీపీ డౌన్ అయిందంటే సిట్ విచారణ ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పేర్లు బయటపెట్టాల్సి రావడంతో సుబ్బరాజుకు మైండ్ బ్లాంక్ అయింది. తనేనా నిజాలను బయటపెట్టింది? అన్న సందిగ్ధంలో పడ్డాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురవడంతో ఆయన బీపీ డౌన్ అయింది.

  సుబ్బరాజుకు బీపీ డౌన్ అవడంతో విచారణకు కొద్దిసేపు బ్రేక్ ఇచ్చిన అధికారులు.. ఉస్మానియా బృందంతో వైద్య పరీక్షలు చేయించారు.

  English summary
  Actor Subbaraju is understood to have spilled some beans while under intense interrogation of sleuths investigating the infamous Hyderabad Drugs Case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X