వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుధాకర్ రెడ్డి హత్య: స్వాతి తండ్రి గుండు గీయించుకుని..రాజేష్ తల్లి ఇలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

భర్తను హత్య చేసిన స్వాతికి కర్మకాండలు, గుండు గీయించుకుని ! | Oneindia Telugu

నాగర్‌కర్నూలు: సుధాకర్ రెడ్డిని కిరాతకంగా హత్య చేసిన స్వాతి, రాజేష్ విషయాల్లో వారి తల్లిదండ్రులు తీసుకున్న వైఖరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ విషయంలో వారు తమ సంస్కారాన్ని ప్రదర్శించారనే మాట వినిపిస్తోంది.

స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ సుధాకర్ రెడ్డిని పథకం ప్రకారం చంపేసి ఆడిన డ్రామా గుట్టును పోలీసులు బయటపెట్టారు. అయితే, వారి తల్లిదండ్రులు కన్న మమకారంతో వారిని వెనకేసుకొస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.

 స్వాతి తండ్రి ఇలా చేశాడు....

స్వాతి తండ్రి ఇలా చేశాడు....

స్వాతి తండ్రి ఆమె తన కూతురు అనే ప్రేమను కూడా చంపేసుకున్నాడు. తల ఎత్తుకుని తిరగకుండా చేసిందని భావిస్తున్నాడు. అసాధారణ రీతిలో ఆమెకు అంత్యక్రియలు జరిపించాదడు. గుండు గీయించుకున్నాడు. పిల్లలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడు

 కుటుంబం ఇలా.

కుటుంబం ఇలా.

స్వాతి బెయిల్ కోసం ప్రయత్నించకూడదని ఆమె కుటుంబం నిర్ణయం తీసుకుంది. స్వాతి, సుధాకర్ రెడ్డిలది మేనరికం పెళ్లి. తన కుమారుడిని హత్య చేసింది కాబట్టి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆమెకు శిక్ష పడాలనే కోరుకుంటారు.

 విజయవాడ వెళ్తున్నానని చెప్పి...

విజయవాడ వెళ్తున్నానని చెప్పి...

రాజేష్‌ది నాగర్‌కర్నూలు మండలంలోని నాగనూల్. ఓ ఫిజియోథెరపి కేంద్రంలో చిన్న ఉద్యోగం చేసేవాడు. తల్లికి విజయవాడ వెళ్తున్నానని చెప్పి స్వాతితో కలిసి సుధాకర్ రెడ్డిని హత్య చేశాడు. ఆమె వేసిన స్కెచ్ మేరకు ముఖం కాల్చుకుని ఆస్పత్రిలో చేరాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.

 రాజేష్ ఫోన్ స్వాచ్ఛాప్..

రాజేష్ ఫోన్ స్వాచ్ఛాప్..

రాజేష్ కుటుంబ సభ్యులు అతని కోసం కొన్ని రోజులు అరా తీశారు. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. వాస్తవం తెలిసి వారు నివ్వెరపోయారు. రాజేష్ తండ్రి కొద్ది నెలల క్రితమే మరణించాడు. తల్లి బాధ వర్ణనాతీతంగా ఉంది. అతని బెయిల్ కోసం ప్రయత్నం చేయకూడదని నిర్ణయం తీసుకుంది.

English summary
The family members of accused in Sudhakar Reddy urder case Swathi and Rajesh family members have decided to keep away from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X