వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదికి ఉప ప్రధాని పదవి: నటుడు సుమన్, కేసీఆర్‌పై ప్రశంసలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హుజూర్‌నగర్: దక్షిణ భారతదేశానికి చెందిన నేతకు ఉప ప్రధాని పదవి ఇవ్వాలని సినీ హీరో సుమన్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Recommended Video

Third Front : Eye on 2019 Polls, OPINION కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనుక అసలు కథ ఇదీ!!

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశానికి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నందున దక్షిణాదికి వారికి మంత్రి వర్గంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా

దేశంలో ఎక్కడా లేని విధంగా

దేశంలో ఎక్కడా లేని విధంగా కేసఆర్ రైతులకు 24 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తూ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నారని సుమన్ ప్రశంసించారు. రైతులకు హల్త్ కార్డులు ఇస్తామనే కేసీఆర్ ఆలోచన బాగుందని అన్నారు.

బిజీగా ఉండడం వల్ల

బిజీగా ఉండడం వల్ల

దేశంలోని తమిళనాడు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కన్నడ సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు సుమన్ తెలిపారు. మహిళలు, విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం కల్పించేందుకు కరాటే పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

విద్యాసంస్థల్లో కరాటే విద్య

విద్యాసంస్థల్లో కరాటే విద్య

రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజి వరకు విద్యాసంస్థల్లో కరాటే విద్యను ప్రవేశపెట్టాలని సుమన్ కోరారు. తమలనాడు తరహాలో అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్య, వైద్యం వంటి సౌకర్యం కల్పించాలని అన్నారు.

విద్యార్థినులకు ఇవన్నీ..

విద్యార్థినులకు ఇవన్నీ..

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థినులకు సైకిళ్లు, స్కూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లుఅందించాలని సుమన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సైనికులకు, రాష్ట్రంలో పోలీసులకు పాలకులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అన్నారు.

English summary
Cine actor Suman appealed to give Deputy CM post to South Indian leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X