• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రగతి పద్దు .. లక్షా 82 వేల కోట్లతో బడ్జెట్

|

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగినా .. ఎవరికీ ఆర్థికశాఖ కేటాయించకపోవడంతో అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్, మండలిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రగతి పద్దును చదివి వినిపించారు.

ప్రతికూలం నుంచి ప్రగతి పథం వైపు ..

ప్రతికూలం నుంచి ప్రగతి పథం వైపు ..

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురైందన్నారు సీఎం కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు సంక్షేమ రంగాలు పడకేశాయని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నిరంగాల్లో తెలంగాణ వెనుకబడిందని ప్రస్తావించారు. అధికారం చేపట్టిన 9 నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని పేర్కొన్నారు. విద్యుత్ సమస్య తీరడంతో వ్యవసాయం, పరిశ్రమలకు నిరంతరం కరెంట్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. అతి తక్కువ కాలంలో అభివృద్ధి పథంలో నడిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని .. యావత్ దేశానికి తెలంగాణ మోడల్ గా నిలువడం గర్వకారణమన్నారు. వివిధ అంశాల్లో నిర్ణీత లక్ష్యంతో ముందుకుసాగుతూ .. తక్కువ సమయంలో డెవలప్ సాధించామని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ వృద్ధి దేశ సగటు కన్నా తక్కువగా ఉండేదని .. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్టు పెరిగిందనే విషయాన్నే బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు కేసీఆర్. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి టీఆర్ఎస్ అధికారం చేపట్టేందుకు దోహదపడిందన్నారు.

గణనీయమైన వృద్ధి

గణనీయమైన వృద్ధి

2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు సీఎం కేసీఆర్. వృద్ధి రేటు 10.6 శాతం ఉండటమే దీనికి నిదర్శమని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,116కు పెంచుతున్నామని సభలో ప్రకటించారు. అలాగే దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116 .. వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తామని ప్రకటించారు. ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్‌లో రూ.12,067 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారాయన.

లక్షా 82 వేల కోట్లతో పద్దు

లక్షా 82 వేల కోట్లతో పద్దు

అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే .. 2019-20 సంవత్సర బడ్జెట్‌ రూ.1,82,017 కోట్లు ప్రతిపాదించారు సీఎం కేసీఆర్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు

ఉంటే .. మూలధన వ్యయం రూ.32,815 కోట్లని .. రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లుగా లెక్కగట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450 కోట్లు కేటాయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కోసం రూ.1810 కోట్లు

, ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581 కోట్లు

, ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు

కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. రైతు రుణ మాఫీ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. గతేడాది డిసెంబర్ 11 లోపు రూ. లక్ష లోన్ తీసుకున్నవారికి ప్రయోజనం కలుగనుంది. సన్న బియ్యం రాయితీ కోసం రూ.2,774 కోట్లు

కేటాయిస్తున్నట్టు ప్రకటించారు కేసీఆర్.

రైతుకు అండగా

ఇదివరకు మాదిరిగానే రైతులకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు. రైతు బీమా కోసం రూ.650 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు మరణించే రైతులకు ఈ పథకంతో మేలు జరుగుతుంది. ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందజేస్తారు. రైతు బంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. గతేడాది ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా ఈ ఏడాది నుంచి రూ.5 వేల చొప్పున రూ.10 వేలు ఇస్తారు. వెనుకబడిన తరగతుల వారికి అండగా ఉంటామనే హామీ మేరకు ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు

ఇస్తామని పద్దులో ప్రస్తావించారు. అలాగే వ్యవసాయశాఖకు రూ.20,107 కోట్లు,

నీటిపారుదలశాఖకు రూ.22,500 కోట్లు కేటాయించి రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తామని ప్రకటించారు. ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536 కోట్లు, పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256 కోట్లు, టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు అందజేశామని .. దీంతో 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు కేసీఆర్. మొత్తం గంటపాటు బడ్జెట్ పద్దును కేసీఆర్ ప్రసంగించగా .. సభ్యులు బల్లచరిచి అభినందనలు తెలిపారు. చివరగా జై హింద్, జై తెలంగాణ అనే నినాదాలతో కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana has achieved substantial growth in the financial year 2018-19 CM KCR. The growth rate is 10.6 percent. In the House, the elderly, widows, single women, beedi workers, educators, veterans, Geeta workers and AIDS pension payments have been raised from Rs 1,000 to Rs 2,116. Similarly, the pension of Rs. 2,000 to Rs. 3,116. The old age pension would be reduced to 60 years from 57 years to pension. He said that Rs 12,067 crore was allocated in the Budget for pension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more