వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్-మోడీ భేటీ ఎఫెక్ట్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు షాక్, సమన్లు, ఎందుకంటే..?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కొరియా నగరాల్లా ఉండాలి: 'కియా'పై బాబు నిలదీత, దుష్టశక్తులంటూ జగన్‌పై..కొరియా నగరాల్లా ఉండాలి: 'కియా'పై బాబు నిలదీత, దుష్టశక్తులంటూ జగన్‌పై..

ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీని వైయస్ జగన్ కలిసిన సమయంలో తప్పుడు కథనాలు రాశారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టుకెక్కారు. దీనిపై సమన్లు జారీ అయ్యాయి.

 రాధాకృష్ణ సహా వీరిపై చర్యలు తీసుకోవాలని

రాధాకృష్ణ సహా వీరిపై చర్యలు తీసుకోవాలని

ప్రధాని మోడీని కలిసిన సమయంలో జగన్‌పై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించిందని పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకటశేషగిరి రావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆళ్ల హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

Recommended Video

Chandrababu Naidu Questioned Government Over Andhra Jyothy Channel. |
 ఆ కథనం ఏమిటంటే..

ఆ కథనం ఏమిటంటే..

మే 15వ తేదీన 'అమ్మ జగనా' అంటూ జగన్‌పై అసత్యాలతో కూడిన, పరువుకు నష్టం కలిగేలా ప్రధాని మోడీకి సమర్పించిన వినతిపత్రంపై తప్పుడు కథనం ప్రచురించారని పేర్కొన్నారు.

కేసుల గురించి వినతిపత్రం అంటూ

కేసుల గురించి వినతిపత్రం అంటూ

వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు, అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధలు, మిర్చి రైతుల దుస్థితి, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి తదితర అంశాలపై ప్రధాని మోడీకి జగన్ వినతిపత్రం ఇచ్చారని వైసిపి చెప్పింది. అయితే జగన్ తనపై నమోదైన కేసులకు సంబంధించి వినతిపత్రం ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి రాసిందని ఆరోపిస్తున్నారు.

 మోడీజీ అని రాస్తే

మోడీజీ అని రాస్తే

ప్రధాని మోడీకి జగన్ రాసిన వినతిపత్రంలో గౌరవనీయులైన నరేంద్ర మోడీజీ అని రాశారని, కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఎక్సలెన్సీ (సర్వశ్రేష్ట) అని రాసినట్లు పేర్కొందని అంటున్నారు. ఈ విజ్ఞాపన పత్రంపై అప్పుడే వైసిపి నేతలు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు. వినతిపత్రాన్ని కూడా వైసిపి మీడియాకు చూపించింది.

దీనిపైనా కొత్త పాట అంటూ

దీనిపైనా కొత్త పాట అంటూ

అయితే వైసిపి చూపించిన వినతి పత్రం పైనా ఆంధ్రజ్యోతి మరో కొనసాగింపు కథనం రాశారు. 'పాత లేఖ పేరిట వైసీపీ కొత్త పాట' అనే హెడ్డింగ్‌తో వార్త రాశారు.

 మోడీని జగన్ కలవడం ఇష్టం లేక

మోడీని జగన్ కలవడం ఇష్టం లేక

ప్రధాని మోడీని జగన్ కలవడం ఓర్చుకోలేక రాధాకృ,్ణ.. తన బృందం ద్వారా తప్పుడు కథనం రాయించి ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఈ కథనం ప్రచురితం కావడానికి రాధాకృష్ణతో పాటు ఆ పత్రిక ఎడిటర్, ఏపీ, తెలంగాణ బ్యోరో ఇంచార్జ్, ఓ రిపోర్టర్ బాధ్యులు అని, వీరందరికీ సమన్లు జారీ చేయాలని ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తొలుత ఆళ్ల వాంగ్మూలం నమోదు చేసింది. తాజాగా, సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది.

English summary
It is said that Nampally court issued summons to Andhra Jyothi MD Radhakrishna for story on YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X