వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భట్టీకి వడదెబ్బ తగిలింది ...కాంగ్రెస్ ప్రజా స్వామ్య పరిరక్షణ యాత్రకు బ్రేక్ పడింది

|
Google Oneindia TeluguNews

Recommended Video

భట్టి విక్రమార్క కు వడదెబ్బ.. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు బ్రేక్ || Oneindia Telugu

కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీ ఫిరాయించిన నేతలకు నిరసనగా , నాలుగు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు . భట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న నేపధ్యంలో విపరీతమైన ఎండల దెబ్బకు ఆయన ప్రారంభించిన యాత్రకు బ్రేక్ పడింది .మండుటెండలో చేపట్టిన యాత్ర కారణంగా ఆయనకు వడదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆయన ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

<strong>మట్టిలో మాణిక్యాలు : జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు</strong>మట్టిలో మాణిక్యాలు : జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు

భట్టికి వడదెబ్బ ... కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ..

భట్టికి వడదెబ్బ ... కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ..

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క మే 01వ తేదీ రాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వైద్య చికిత్స అందింస్తున్నారు . వడదెబ్బ కారణంగా జ్వరం వచ్చిందని..ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు వైద్యులు. ఆయనకు రెస్టు అవసరమని సూచించారు. దీంతో ఆయన నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ద్వారా టీఆర్ఎస్ నియంత పాలనపై ప్రచారం

ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ద్వారా టీఆర్ఎస్ నియంత పాలనపై ప్రచారం

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టారు . భద్రాచలం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. రానున్న ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల తరపున పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రచారం చెయ్యటంతో పాటు , తెలంగాణాలోని అధికార పార్టీ చేస్తున్న నియంత పాలనపై ఈ యాత్ర ద్వారా ప్రచారం చెయ్యాలని భావించి ప్రారంభించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సాగనున్న యాత్ర

ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సాగనున్న యాత్ర

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నదంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ అందులో భాగంగా ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలంటూ పోరాటం చేస్తుంది . ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్న నేపధ్యంలో భట్టికి వడదెబ్బ తగలటంతో తాత్కాలికంగా యాత్రకు ఆటంకం కలిగింది .

English summary
Congress leader Bhatti Vikramarka hospitalised due to high fever on Wednesday night. He was admitted to a private hospital in Khammam. He is learned to have suffered sunstroke. However, his health condition is stated to be stable.Bhatti has been taking part in the rally for the last three days. The Congress party is organising rallies across the various assembly segments against the MLAs who defected to another party after winning from Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X