హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసుల్ని తప్పించుకొనేందుకు 'ముత్తూట్' దొంగల విహారయాత్రలు

రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కేసులో నిందితుడైన సుందర్ రాజారత్నం ఆయన సతీమణి రాధతో కలిసి విహరయాత్రలకు వెళ్ళాడు. అయితే పోలీసులు వలపన్ని వారిద్దరిని అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కేసులో నిందితుడైన సుందర్ రాజారత్నం ఆయన సతీమణి రాధతో కలిసి విహరయాత్రలకు వెళ్ళాడు. అయితే పోలీసులు వలపన్ని వారిద్దరిని అరెస్టు చేశారు. ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారాన్ని దోచుకొన్న తర్వాత పోలీసుల్ని కాపాడుకొనేందుకు సుందర్ ఈ ప్రయత్నం చేశాడు. అయితే చివరకు పోలీసుల వలలో చిక్కుకొన్నాడు.

రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితుడు లక్ష్మణ్ నారాయణముదంగ్ తో పాటు మరో ఏడుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే తాజాగా సుందర్ రాజారత్నం తో పాటు ఆయన భార్యను కూడ సోమవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు.

 Sundar Rajaratnam couple visits tourist places for escape from police

గత ఏడాది డిసెంబర్ 28న, లో రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ లో దుండగులు 41.8 కిలోల బంగారు ఆభరణాలు దోచుకొన్నారు. ఈ ఘటన జరిగిన ఐదురోజుల్లోనే పోలీసులు ఐదుగురిని అరెస్టు చేనశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని కూడ రిమాండ్ కు తరలించారు.

తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సుందర్ రాజారత్నం ఆయన సతీమణి రాధను కూడ అరెస్టు చేశారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేయడంతో ముంబాయి నుండి సుందర్ రాజారత్నం దంపతులు ముంబై నుండి పారిపోయారు.

నేపాల్, కోయంబత్తూరు, చెన్నై, ఊటీ, గోవాల్లో గడిపారు. ఈ కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకొనేందుకుగాను వారు విహరయాత్రలకు వెళ్ళారు. అయితే సుందర్ దంపతులు ధారవి వచ్చారననే సమాచారం తెలుసుకొన్న ముంబాయి, హైద్రాబాద్ పోలీసులు సుందర్ దంపతులను అరెస్టు చేశారు.

English summary
Sundar Rajaratnam couple visited various tourist places after Muthoot finance gold theft. police arrested them in Dharavi on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X