వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి.... గులాబీ గూటికి చేరనున్న సునీతా లక్ష్మా రెడ్డి

|
Google Oneindia TeluguNews

కొనసాగుతున్న వలసలు పర్వంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. వరుస వలసలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హస్తానికి హ్యాండ్ ఇచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంది.

టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ? టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ?

 టీఆర్ఎస్ బాట పట్టిన సునీతా లక్ష్మారెడ్డి

టీఆర్ఎస్ బాట పట్టిన సునీతా లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రగతి భవన్‌లో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో సమావేశమయ్యారు. నర్సాపూర్‌లో జరగనున్న సభలో సునీతా టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

బీజేపీ లో చేర్చేందుకు విఫలయత్నాలు చేసిన డీకే అరుణ

బీజేపీ లో చేర్చేందుకు విఫలయత్నాలు చేసిన డీకే అరుణ

అయితే సునీతా లక్ష్మారెడ్డి ని బిజెపిలో చేర్చుకోవాలని డీకే అరుణ విఫల యత్నాలు చేస్తుంది. పలుమార్లు బండారు దత్తాత్రేయ తో కలిసి సునీత లక్ష్మారెడ్డి ని పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేసింది. ఒక దశలో ఆమె బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం సైతం జరిగింది. పార్టీలో చేరితే చేవెళ్ల నియోజకవర్గం నుండి టిక్కెట్ ఇస్తామని తెలిపినప్పటికీ బిజెపిలో చేరడానికి సునీత లక్ష్మారెడ్డి ఆసక్తి చూపలేదు.

కేసీఆర్ ను కలిసిన సునీత ... గులాబీ గూటికి చేరనున్న కాంగ్రెస్ మహిళా నేత

కేసీఆర్ ను కలిసిన సునీత ... గులాబీ గూటికి చేరనున్న కాంగ్రెస్ మహిళా నేత

ఇక అనూహ్యంగా గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకుని సీఎం కేసీఆర్ ని కలిసిన సునీత లక్ష్మారెడ్డి పార్టీలో చేరే విషయంపై గులాబీ బాస్ తో చర్చించింది. నర్సాపూర్లో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.

English summary
Senior Congress leader and former AP Home Minister Sunitha lakshmaa reddy who was believed to be joining the BJP gave a big shock to the Congress party and BJP . As per the sources, Sunitha lakshma Reddy has decided to leave Congress . she went to meet KCR at pragathi bhavan and decided to join in TRS .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X