హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ సునీత హత్య మిస్టరీ: మొబైల్ ఇంట్లోనే, కైనెటిక్ హోండాపై వెళ్తూ...

సునీత ఇంటి నుంచి తన సెల్ ఫోన్ తీసుకుని వెళ్లలేదని, కైనెటిక్ హోండాపై వెళ్తూ సిసిటివీ ఫుటేజీల కనిపించిదని పోలీసులు గుర్తించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హత్యకు గురైన టెక్కీ సునీత బుధవారం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తన సెల్ ఫోన్ తీసుకుని వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. ఆమె కైనెటిక్ హోండాపై వెళ్తూ సిసిటీవీ ఫుటేజీలో కనిపించిన విషయాన్ని కూడా వారు గుర్తించారు.

టెక్కీ సునీత హత్య కేసులో మరో ట్విస్ట్: లైంగిక దాడి జరిగిందా, ఆ రెండు రోజులేమైంది? టెక్కీ సునీత హత్య కేసులో మరో ట్విస్ట్: లైంగిక దాడి జరిగిందా, ఆ రెండు రోజులేమైంది?

తన సెల్ ఫోన్‌ను ఆమె మరమ్మత్తుకు ఇచ్చిందని, రెండు సిమ్‌లను మాత్రం వెంట తీసుకుని వెళ్లిందని పోలీసులు అంటున్నారు. వాటిలో ఒక్కటి కాలిపోయింది. రెండో సిమ్ కార్డును పోలీసులు పరిశీలించారు. కాలిపోయిన ఆమె దేహం బుధవారంనాడు భాగ్యనగర్ కాలనీలో కనిపించింది.

తన బంధువు చనిపోయారనే కారణంతో ఆమె మంగళవారం, బుధవారం ఆఫీసుకు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమె ఈమెయిల్ సందేశాలను, వాట్సప్ సంభాషణలను పరిశీలిస్తున్నారు.

అది అతనికి కూడా తెలుసు...

అది అతనికి కూడా తెలుసు...

మానస్టర్ డాట్ కామ్‌లో పనిచేస్తున్న సునీత బంధువుల్లో ఒకరికి ఆమె ఈమెయిల్ యాక్సెస్ ఉందని భావిస్తున్నారు. వాట్సప్ సందేశాలను తన మొబైల్ ఫోన్ నుంచి కాపీ చేసి ఆ ఈమెయిల్‌కే ఆమె పంపించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అనుమానితుడిని పోలీసులు ఇంకా గుర్తించలేదు.

ఆ రోజుల్లో ఎక్కడ ఉందనేది....

ఆ రోజుల్లో ఎక్కడ ఉందనేది....

మంగళవారం, బుధవారం ఆమె ఎక్కడ ఉందనేది కేసులో కీలకమైన విషయం అవుతుందని పోలీసులు భావిస్తు్నారు. ఆమె కాల్ రికార్డులు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. కాల్ రికార్డులను పరిశీలించామని, అనుమానమైన అంశాలు కనిపించలేదని పోలీసులు అంటున్నారు. అనుమానితుడిని గుర్తించడానికి ఈమెయిల్స్ తనిఖీ చేస్తున్నట్లు చెబుతున్నారు.

 ప్రతి రోజూ 9 గంటలకు ఇంటికి.

ప్రతి రోజూ 9 గంటలకు ఇంటికి.

సునీత ఆఫీసు నుంచి ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకుంటుంది. మంగళవారంనాడు రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చింది. బుధవారంనాడు ఆఫీసుకు బయలుదేరిన సమయంలో లంచ్ ప్యాక్ చేశానని ఆమె సోదరి చెప్తే ఆఫీసులో లంచ్ పెడుతారని సునీత చెప్పిందని అంటున్నారు.

ఫోన్‌లో చాలా సేపు మాట్లాడేది..

ఫోన్‌లో చాలా సేపు మాట్లాడేది..

సునీత ఫోన్‌లో చాలా సేపు మాట్లాడుతూ ఉండేదని, తన సహోద్యోగుల గురించి ఏమీ చెప్పేది కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. సహోద్యోగులకు కూడా ఆమె గురించి ఎక్కువగా తెలియదు. ఆమె మరణానికి నెల రోజులు ముందు మాత్రమే ఆ ఆఫీసులో చేరింది.

English summary
Police found that the murdered K. Sunitha did not take her phone when she left home on Wednesday. She was also seen on the pillion of a Kinetic Honda in a CCTV image found by cops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X