హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంగ్రాట్యులేషన్స్ కేటీఆర్ గారు: సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గ్రీటింగ్స్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.

ఫిబ్రవరి 11న

ఫిబ్రవరి 11న

ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్‌కు కూడా చేరింది. దీనితో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించినట్టయింది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఈ కార్ రేసింగ్ ఉంటుంది. దీనికి అవసరమైన పనులు త్వరలోనే మొదలు కానున్నాయి.

గత ఏడాదే అగ్రిమెంట్..

గత ఏడాదే అగ్రిమెంట్..

తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఎఫ్ఐఏ ఫార్ములా ఈ చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బెర్టో లొంగో, రేసింగ్ ట్రాక్ అండ్ ఓవర్‌లాగ్ డైరెక్టర్ ఆగస్ జొమెనో, గ్రీన్‌కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫసీర్ అనిల్ చలమలశెట్టి, మహీంద్రా రేసింగ్ సీఈఓ అండ్ టీమ్ ప్రిన్సిపల్ దిల్‌బాగ్ గిల్ మధ్య గత ఏడాదే ఒప్పందాలు కుదిరాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించబోతున్నామంటూ అప్పట్లో వారు ప్రకటించారు.

22 కార్లతో..

22 కార్లతో..

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ గడువు సమీపిస్తోండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. మొత్తం 22 కార్లు ఇందులో పాల్గొంటాయి. 11 టీమ్‌లు రేసింగ్ కోసం హైదరాబాద్ కు రానున్నాయి. రేసింగ్ ట్రాక్ పొడవు సుమారు 2.8 కిలోమీటర్లు. ఆన్‌ లైన్‌లో ద్వారా బుక్ చేసుకోవడానికి మొత్తం 22,500 టికెట్లను టోర్నమెంట్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

రేసింగ్ పట్ల ఎగ్జైటింగ్..

రేసింగ్ పట్ల ఎగ్జైటింగ్..

ఈ రేసింగ్ తో ప్రపంచ క్రీడా పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం దక్కబోతోందని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయని ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నానని చెప్పారు. వాతావరణం మార్పులో భాగంగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించిన ఈ ఫార్ములా-ఈ కార్ రేస్ గ్రాండ్ సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

కేటీఆర్ కు విషెస్..

మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం, అనిల్ చలమలశెట్టికి ఆయన అభినందనలు తెలియజేశారు. భారత్ లో మొట్టమొదటిసారిగా క్లీన్ ఎనర్జీతో ఫార్ములా-ఈ కారు రేసులను నిర్వహించడంలో వారు చొరవ చూపారని ప్రశంసించారు. గ్రీన్ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ టోర్నమెంట్ ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. నెట్ జీరో కార్బన్ ను విడుదల చేసే ఈ రేసింగ్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

జగన్‌తో యోగి ఆదిత్యనాథ్ రాయబారి కీలక భేటీ: ఆ మూడు అంశాలపై ఆరా..!!జగన్‌తో యోగి ఆదిత్యనాథ్ రాయబారి కీలక భేటీ: ఆ మూడు అంశాలపై ఆరా..!!

English summary
Super Star Mahesh Babu congratulates Minister KTR for conducting Formula E race in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X