వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రెండ్స్ కు డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా బుక్కయిపోయారు (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సరదా కోసం గోవా వెళ్లిన యువకులు డ్రగ్స్ తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఫ్రెండ్స్ కు కూడా అలవాటు చేసి.. తద్వారా వచ్చిన డబ్బుతో మళ్లీ గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలకున్నారు. కానీ పోలీసుల అకస్మిక దాడులతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో ఆ ఇద్దరితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేయబోయిన మరో ఇద్దరు ప్రస్తుతం కటకటాలపాలయ్యారు.

 గోవాలోనే పరిచయం

గోవాలోనే పరిచయం


హైదరాబాద్ లోని బేగంపేట్, బేగం బజార్ లకు చెందిన మేహర్ చరణ్(23), ముఖేష్ సింగ్(26) లు నాలుగురోజుల క్రితం గోవా టూర్ కు వెళ్లారు. హోండా సిటీ కారులో (టీఎస్09ఈడీ9070) గోవా వెళ్లిన ఈ ఇద్దరికీ.. అక్కడో డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతొ ఆ డ్రగ్స్ ను కొనుగోలు చేసి గోవాలో ఎంజాయ్ చేశారు.

 ఫ్రెండ్స్ కు కూడా అలవాటు చేయాలని

ఫ్రెండ్స్ కు కూడా అలవాటు చేయాలని

డ్రగ్స్ తో గోవాలో జల్సా చేసిన తర్వాత.. హైదరాబాద్ లోని ఫ్రెండ్స్ కు కూడా డ్రగ్స్ ను అలవాటు చేసి తద్వారా డబ్బు సంపాదించాలనుకున్నారు. తిరిగి ఆ డబ్బుతో గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలనేది వారి ప్లాన్. ఇందుకోసం గోవా నుంచి వచ్చేటప్పుడు రూ.50వేల డ్రగ్స్ ను కొనుగోలు చేశారు. గోవా నుంచి తిరిగొస్తుండగా.. ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి షాద్ నగర్ వద్దకు రావాలని సూచించారు. దీంతో సుశ్రుత్, క్రుష్ణకాంత్ మాధవరావు అనే ముగ్గరు స్నేహితులు మహీంద్రా కారులో షాద్ నగర్ కు చేరుకున్నారు.

షాద్ నగర్ లో వీరందరు కలుసుకోగా..

షాద్ నగర్ లో వీరందరు కలుసుకోగా..

వెంట తెచ్చిన డ్రగ్స్ ను వారికి విక్రయించేందుకు మేహర్ చరణ్, ముఖేశ్ సింగ్ లు సిద్దమయ్యారు. ఇంతలో పోలీసులు అకస్మిక దాడులు చేయడంతో.. నలుగురు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దాడుల్లో భాగంగా.. నిషేధిత డ్రగ్ ఎక్స్ టేసి-32పిల్స్, హషీస్- 4గ్రాములు, ఎల్.స్డీ-19పేపర్ బిళ్లలు, మెత్తంఫెటామైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫ్రెండ్స్ కు డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా బుక్కయిపోయారు (ఫోటోలు)

ఫ్రెండ్స్ కు డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా బుక్కయిపోయారు (ఫోటోలు)

చరణ్, ముఖేష్ లకు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తితో పాటు, నగరంలో ఇలాంటి దందాలకు పాల్పడుతున్నవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. కాగా, పట్టుబడ్డ ఐదుగురు బిటెక్ ను మధ్యలోనే వదిలేసి జులాయిగా తిరుగుతున్నట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. వీరంతా మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారేనని తెలియజేశారు.

English summary
Hyderabad police were arrested five youth at shadnagar while buying drugs from their friends. All those students were btech dropouts only
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X