తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్: 5 రాష్ట్రాల సీజేల నియామకం, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు నూతన ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు చేసింది. తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాల హైకోర్టుకు కొత్త సీజేలను నియామకం కానున్నారు.
తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మను బదిలీ చేసి.. ఆయన స్థానంలో న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు. జస్టిస్ సతీష్ చంద్ర గత మూడు నెలల కిందట తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.

ఢిల్లీ
హైకోర్టు
న్యాయమూర్తిగా
ఉన్న
జస్టిస్
విపిన్
సంఘీని
ఉత్తరాఖండ్
హైకోర్టు
సీజేగా
నియమించాలని
కొలీజియం
సిపార్సు
చేసింది.
బాంబే
హైకోర్టు
న్యాయమూర్తిగా
ఉన్న
జస్టిస్
అమ్జద్
ఎ.
సయీద్‌ను
హిమాచల్‌ప్రదేశ్
హైకోర్టు
సీజేగా,
గుజరాత్
హైకోర్టు
న్యాయమూర్తిగా
ఉన్న
జస్టిస్
ఎం
ఛాయాను
గౌహతి
హైకోర్టు
సీజేగా
నియమించాలని
సిఫార్సు
చేసింది.
బాంబే
హైకోర్టు
మరో
న్యాయమూర్తి
జస్టిస్
ఎస్ఎస్
షిండేను
రాజస్థాన్
హైకోర్టు
ప్రధాన
న్యాయమూర్తిగా
నియమించాలని
కొలీజియం
సిఫార్సు
చేసింది.
కాగా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 2011-17 అక్టోబర్ గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 20న నిర్ధారించబడ్డారు. మిజోరాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అస్సాం జ్యుడీషియల్ అకాడమీ, గౌహతిలోని నేషనల్ లా యూనిర్సిటీలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు.