వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవి ప్రకాష్ కు సుప్రీంలో షాక్ .. కానీ ఈ కేసులో పొలిటికల్ ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌‌, శివాజీల కోసం ఇంకా పోలీసులు గాలింపు చేస్తూనే వున్నారు. వాటాలు, ఫోర్జరీ, నిధుల మళ్లీంపు తదితర వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. ఇక రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.రవిప్రకాశ్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో రవి ప్రకాష్ కు అత్యున్నత న్యాయస్థానంలో కూడా షాక్ తగిలింది.

తిరుమలలో వీవీఐపీ దర్శనాలపై షాకింగ్ కామెంట్ చేసిన వెంకయ్య నాయుడు... ఏమన్నారంటేతిరుమలలో వీవీఐపీ దర్శనాలపై షాకింగ్ కామెంట్ చేసిన వెంకయ్య నాయుడు... ఏమన్నారంటే

రవిప్రకాశ్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు.. లభించని ఊరట

రవిప్రకాశ్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు.. లభించని ఊరట

రవిప్రకాశ్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. న్యాయస్థానంలో వాదనల అనంతరం సుప్రీం ధర్మాసనం రవి ప్రకాష్ ను బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. రవి ప్రకాష్‌ ను అరెస్టు చేయాలని వస్తే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్ కు ఆదేశించింది. జూన్ 10న ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసువాలని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

సుప్రీం లో అభ్షేక్ మను సింఘ్వి వాదనలు వినిపించటానికి కారణం అదేనా

సుప్రీం లో అభ్షేక్ మను సింఘ్వి వాదనలు వినిపించటానికి కారణం అదేనా

అయితే ఈ కేసులో ఒక పొలిటికల్ ట్విస్ట్ ఉన్నట్టు చాలా మంది భావిస్తున్నారు. ఒకపక్క రవి ప్రకాష్ ఏపీలో చంద్రబాబుకు సపోర్ట్ చేశారని , టీఆర్ఎస్ కు, బీజేపీకి వ్యతిరేకంగా పని చేశారని చర్చ జరిగిన నేపధ్యంలో ఆ చర్చకు ఊతమిస్తూ రవి ప్రకాష్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో టీఆర్ ఎస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ప్రకటించారు. ఇక ఇప్పటివరకు పోలీసుల ముందు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన రవి ప్రకాష్ కు అభిషేక్ మను సింఘ్వి అడ్వకేట్ గా న్యాయస్థానంలో వాదనలు వినిపించటం పట్ల రాజకీయ చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న అభిషేక్ మను సింఘ్వి రవి ప్రకాష్ కోసం వాదించటం రాజకీయ కోణం లో చూడొచ్చేమో అన్న భావన కూడా వ్యక్తం అవుతుంది. ఒకపక్క బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ రవి ప్రకాష్ మీద దాడికి దిగుతుంది అని రవి ప్రకాష్ చెప్తున్న నేపధ్యంలో రవి ప్రకాష్ కు కాంగ్రెస్ సహకారం అందిస్తుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. తనపైన కేసుల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పిన నేపధ్యంలో రవి ప్రకాష్ రాజకీయ కోణంలో కాంగ్రెస్ నేతల సహకారం తీసుకుంటున్నారా అన్న భావన కూడా వ్యక్తం అవుతుంది.

 బెయిల్ కష్టమే .. విచారణకు హాజరు కావాల్సిందే .. రవి ప్రకాష్ ఏం చేస్తాడో ?

బెయిల్ కష్టమే .. విచారణకు హాజరు కావాల్సిందే .. రవి ప్రకాష్ ఏం చేస్తాడో ?

ఇక కేసు విషయానికి వస్తే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినా రవి ప్రకాష్ మాత్రం ఇప్పటివరకు పోలీసుల ముందుకు రాలేదు . అయితే ఏపీలోకొంత కాలం తలదాచుకున్న రవిప్రకాష్ అక్కడి నుంచి బెంగుళూరు వెళ్ళారని సమాచారం .. తర్వాత గుజరాత్ వెళ్లారనే సమాచారంతో అక్కడా పోలీసులు తనిఖీలు చేశారు.ఆయన మాత్రం ఎక్కడ ఉన్నారో పోలీసులకు అంతు చిక్కటం లేదు. రవి ప్రకాష్, శివాజీలను పట్టుకోవటంలో తెలంగాణా పోలీసులు విఫలం అయ్యారు . ఇక రవిప్రకాశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించాలని సూచించటంతో బెయిల్ కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా తెలంగాణా పోలీసులకు పట్టుబడకుండా రవి ప్రకాష్, శివాజీలు సవాల్ విసురుతున్నారు. ఇలా ఎంత కాలం పట్టుబడకుండా తలదాచుకుంటారు అన్నది ప్రస్తుతం పోలీస్ అధికారుల ముందు ఉన్న ప్రశ్న .

English summary
Supreme Court of India on Monday dismissed the plea of former TV9 CEO Ravi Prakash's anticipatory bail petition. Supreme Court ordered Ravi Prakash to approach the High Court for anticipatory bail. It also ordered the High Court to hear the petition on the basis of merit. SC ordered Ravi Prakash to attend the enquiry as per 41 A notice. Meanwhile, SC also suggested the Telangana government to give notice of 48 hours before to arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X