వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు ఎన్నికలపై స్టే విధించే అధికారం హైకోర్టుకు: కేసీఆర్‌కు సుప్రీం కోర్టు ఝలక్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ముందస్తు ఎన్నికలపై స్టే విధించే అధికారం హైకోర్టుకు

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల పిటిషన్ పైన సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరిగింది. అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పైన స్టే విధించవలసి వస్తే హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ లోపే విచారణ పూర్తి కావాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కనిపిస్తే హైకోర్టు స్టే విధిస్తుందనే ఆశతో విపక్షాలు ఉన్నాయి. అదే జరిగితే తెరాసకు షాక్ అని చెప్పవచ్చు.

నేను తగ్గేది లేదు: ఐటీ ఆఫీస్‌లో ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ, సమాధానాలపై సంతృప్తినేను తగ్గేది లేదు: ఐటీ ఆఫీస్‌లో ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ, సమాధానాలపై సంతృప్తి

Supreme Court suggestion to High Court on Telangana early elections

తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్ వేశారని లాయర్ జంధ్యాల రవిశంకర్ తెలిపారు. శశిధర్ రెడ్డి రిట్ పిటిషన్ పైన హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించిందని జంధ్యాల తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఓటర్ల జాబితా విడుదలను అవసరమైతే వాయిదా వేసుకోవాలని సుప్రీం కోర్టు సూచన చేసిందని జంధ్యాల తెలిపారు.

మరోవైపు,తెలంగాణలో జరిగే ఎన్నికల్లో 2018, జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారే ఓటుహక్కు వినియోగించుకోవాలని ఈసీ చేసిన ప్రకటనపై శశాంక్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 20 లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోయే అవకాశం ఉందన్నారు. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఇదే అంశంపై నాలుగు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున వీటినీ వాటితో పాటు విచారించాలని హైకోర్టుకు సూచించింది.

English summary
Supreme Court suggestion to High Court on Telangana early elections. SC says High Court have right to stay on early elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X