వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంగ్స్, హర్ట్, బ్రెయిన్‌కు గాయాలు.. కిడ్నీపై ఎఫెక్ట్... అత్యంత విషమంగా సురేశ్ ఆరోగ్యం

|
Google Oneindia TeluguNews

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన కూర సురేశ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఉస్మానియా వైద్యులు తెలిపారు. విజయారెడ్డితోపాటు సురేశ్ కూడా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే విజయ చనిపోయారు. పోలీసుస్టేషన్‌లో లొంగిపోయిన సురేశ్‌ను వైద్యులు తొలుత హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

విజయారెడ్డి సజీవదహనం, సురేశ్ భూములు కొన్నది మల్‌రెడ్డి రంగారెడ్డి : ఎమ్మెల్యే కిషన్ రెడ్డివిజయారెడ్డి సజీవదహనం, సురేశ్ భూములు కొన్నది మల్‌రెడ్డి రంగారెడ్డి : ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

విషమంగానే..

విషమంగానే..

సురేశ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. రేపు, మాపు అనే సిచుయేషన్ ఉందని పేర్కొన్నారు. 50 శాతానికి మింగి గాయాలైతే రోగి బతుకడని.. ఒకవేళ అలా జరిగితే మిరాకిల్ అని స్పష్టంచేశారు. సురేశ్ ఛాతీ నుంచి పైకి కాలిపోయాడని.. అందులో 65 శాతం గాయాలు ఉన్నాయని తెలిపారు. శరీరంలో ప్రధాన అవయమమైన ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. దీంతోపాటు గుండె, బ్రెయిన్ లాంటి కీలక అవయవాలపై కూడా ఎఫెక్ట్ ఉందని చెప్పారు.

ప్రధాన అవయవాలపై ఎఫెక్ట్

ప్రధాన అవయవాలపై ఎఫెక్ట్

ప్రధాన అవయవాలు కాలడంతో కిడ్నీ కూడా దెబ్బతింటుందని చెప్పారు. డీ హైడ్రేషన్‌తో కిడ్నీపై ఎఫెక్ట్ ప్రారంభమైందని చెప్పారు. సోమవారం సాయంత్రం సురేశ్ తమతో మాట్లాడారని.. బాగానే స్పందించాడని తెలిపారు. కానీ నిన్న కొంచెం మాట తగ్గిందని.. ఇవాళ గొంతు బయటకు రావడం లేదని చెప్పారు. సురేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. ఇదే విషయాన్ని వారి కుటుంబసభ్యులకు కూడా తెలిపినట్టు వివరించారు.

ఆ రోజు లేను..

ఆ రోజు లేను..

సోమవారం ఆస్పత్రిలో చేరే సమయంలోనే డైయింగ్ డిక్లరేషన్ పత్రాన్ని మేజిస్ట్రేట్ ముందు సురేశ్ ఇచ్చారని ఉస్మానియా ఆర్ఎం వెల్లడించారు. భూమికి సంబంధించి సురేశ్ తమతో ఎప్పుడూ చెప్పలేదని.. డిష్కస్ కూడా చేయలేదని అతని భార్య తెలిపారు. భూమి విషయాన్ని ఇంటి వద్ద ఎప్పుడూ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. సోమవారం తాను ఇంటి వద్ద లేనని.. మీడియా ప్రతినిధులకు తెలిపారు.

ఇదీ విషయం

ఇదీ విషయం

తమ భూమి పట్టా చేయాలని తహశీల్దార్ విజయారెడ్డిని సురేశ్ పలుమార్లు కోరారు. అయితే ఆ భూమి కోర్టు పరిధిలో ఉండటం, జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్ నేపథ్యంలో విజయారెడ్డి ఏ చర్యలు తీసుకోలేకపోయారు. తన భూమిపై తహశీల్దార్ జాప్యం చేస్తున్నారని భావించిన సురేశ్.. సోమవారం విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. అక్కడికక్కడే విజయారెడ్డి చనిపోగా.. ఆమెను కాపాడబోయి తీవ్రగాయాలైన డ్రైవర్ నిన్న చనిపోయారు. నిందితుడు సురేశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అటెండర్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

English summary
suresh health situation is very critical osmania doctors told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X