వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సురేశ్ మానసిక పరిస్థితి బాగోలేదు, భూవివాదం ఎప్పటిదో, అతనికి సంబంధం లేదన్న తల్లి పద్మ

|
Google Oneindia TeluguNews

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని హతమార్చిన సురేశ్‌కు మతిస్థిమితం సరిగా లేదని అతని తల్లి చెప్తున్నారు. గత కొన్నిరోజులగా అతనికి మతి సరిగా లేదని తల్లి పద్మ మీడియాకు తెలిపారు. తమ భూమి వివాదం ఇప్పటిదీ కాదని.. గత కొద్దిరోజులగా ఉందని పేర్కొన్నారు. దాంతో సురేశ్‌కు సంబంధమే లేదని పేర్కొన్నారు. తహశీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించగా.. అతనికి మెంటల్ స్టెబిలిటీ లేదని అతని తల్లి చెప్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Recommended Video

తహసీల్దార్‌ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి || Oneindia Telugu
ఎళ్ల నుంచి లిటిగేషన్

ఎళ్ల నుంచి లిటిగేషన్

తమ భూ వివాదం ఇప్పటిదీ కాదని సురేశ్ తల్లి పద్మ తేల్చిచెప్పారు. ఎన్నో ఏళ్లుగా లిటిగేషన్ ఉందని పేర్కొన్నారు. ఆ భూవివాదంతో సురేశ్‌కు సంబంధమే లేదని తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు సురేశ్ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. తండ్రి కృష్ణతో కలిసి కట్టెలు కూడా కొట్టాడని చెప్పారు. తర్వాతే బయటకు వెళ్లాడని పేర్కొన్నారు. కానీ తహశీల్దార్‌ విజయారెడ్డినే హతమారుస్తాడని ఊహించలేదని పేర్కొన్నారు. సురేశ్ హత్య చేశాడని టీవీలో చూసి నిర్గాంతపోయామని చెప్పారు.

 పోన్ స్విచాఫ్..

పోన్ స్విచాఫ్..

మధ్యాహ్నం ఇంటికి రాలేదని సురేశ్‌కు ఫోన్ చేస్తే.. స్విచాఫ్ వచ్చిందని పద్మ తెలిపారు. తర్వాత టీవీలో వార్తలు చూసి షాక్ తిన్నామని చెప్పారు. గత కొద్దిరోజుల నుంచి సురేశ్.. మతిస్థిమితం సరిగాలేదని పేర్కొన్నారు. అతను తహశీల్దార్ కార్యాలయానికి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏదీ ఏమైనా సురేశ్ మానసిక పరిస్థితిపై అతని తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వస్తూనే లాక్ వేశాడు..

వస్తూనే లాక్ వేశాడు..

మరోవైపు విజయారెడ్డిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న ఉద్యోగి ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. జరిగిన వివరాలను తెలియజేశారు. సోమవారం తహశీల్దార్‌ను కలువడానికి చాలామంది వచ్చారని తెలిపారు. ఆ తర్వాతే సురేశ్ వచ్చాడని పేర్కొన్నారు. ఆయనను పంపిస్తే లాక్ వేశాడని.. ఏదో మాట్లాడుతున్నట్టు నటించి.. నిప్పటించాడని పేర్కొన్నారు.

బాటిల్ ఎక్కడ పెట్టాడో తెలియదు..

బాటిల్ ఎక్కడ పెట్టాడో తెలియదు..

వెంటనే తాను లాక్ తీశానని.. కానీ అప్పటికే మేడమ్‌కు మంటలు అంటుకున్నాయని చెప్పారు. సురేశ్ పెట్రోల్ బాటిల్ ఎక్కడినుంచి తీసుకొచ్చారో అర్థం కాలేదన్నారు. బాటిల్ మాత్రం ఉందని.. అదీ ఎలా తీసుకెళ్లారో అర్థం కావడం లేదన్నారు.

English summary
suresh mental stability is not stable his mother padma told. land dispute going on not today many years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X