వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్షలు పోగొట్టుకున్న సురేష్,న్యాయం చేస్తానన్న ఎమ్మెల్యే ఎవరు? విజ‌యారెడ్డి హ‌త్య కేసులో కీలక మలుపులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సంచలనం రేపిన విజయరెడ్డి హత్య కేసు కీలక ములుపులు తిరుగుతోంది. కోట్ల విలువైన భూములు, దాని ఓనర్ గా చెప్పుకుంటున్న సురేష్ మద్య ఓ ఎమ్మెల్యే మద్యవర్తిత్వం నడిపినట్టు తెలుస్తోంది. వివాదాల భూ అంశంలో న్యాయం చేస్తానని సురేష్ నుండి లక్షల రూపాయలు ఆ ఎమ్మెల్యే దండుకున్నట్టు కూడా తెలుస్తోంది. విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. సదరు ఎమ్మెల్యే మాటలను కూడా విజయారెడ్డి బేఖాతరు చేయడంతో బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీంతో విజయా రెడ్డి బదిలీకి కూడా ప్రయత్నాలు చేసినట్టు నిర్ధారణ అవుతోంది.

విజయ హత్య నిందితుడిపై కఠిన చర్యలు: సీఎం కేసీఆర్విజయ హత్య నిందితుడిపై కఠిన చర్యలు: సీఎం కేసీఆర్

Recommended Video

తహసీల్దార్‌ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి || Oneindia Telugu
 తహశిల్దారు అమానుష హత్య.. బెదింరిపులకు పాల్పడిన ఆ ఎమ్మెల్యే ఎవరు..?

తహశిల్దారు అమానుష హత్య.. బెదింరిపులకు పాల్పడిన ఆ ఎమ్మెల్యే ఎవరు..?

అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య కేసులో సూత్ర‌దారులెరు అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమెను అంత‌టి దారుణంగా కాల్చి చంపేతంటి అప‌కారం ఏం చేసింది? కేసులో నిందితుడు సురేష్ మ‌తిభ్ర‌మించిన వ్య‌క్తిగా ప్ర‌చారం సాగుతుంది. అత‌డి త‌ల్లి కూడా తన కొడుకు అమాయ‌కుడు అంటోంది. కానీ విసిగిపోయిన సురేష్ హ‌త్య‌కు ప‌క్కాగా ప్రణాళిక రచించాడు. పెట్రోల్ పోసి నిప్పంటించన తర్వాత చనిపోయిన‌ట్టు నిర్ద‌ార‌ణకు రాగానే పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయారు. పాసుపుస్త‌కాలు ఇవ్వ‌క‌పోవ‌టం వ‌ల్ల‌నే హ‌త్య‌చేసిన‌ట్టు ఒప్పుకున్నాడు. అయితే ఎటువంటి క్రిమిన‌ల్ బ్యాక్ గ్రౌండ్ లేని ఓ వ్య‌క్తి, హ‌త్య చేసి ఇంత నింపాదిగా ఎలా వ్య‌వ‌హ‌రించాడ‌నేది ఆసక్తి రేపుతున్న అంశం.

 నగరంలో అనేక వివాదాస్పద భూములు.. అందరూ పరిష్కరిస్తామని ముందుకొచ్చే వాళ్లే..

నగరంలో అనేక వివాదాస్పద భూములు.. అందరూ పరిష్కరిస్తామని ముందుకొచ్చే వాళ్లే..

వాస్త‌వానికి హైద‌రాబాద్ మహానగరం చుట్టుప‌క్క‌ల వేలాదిగా భూ వివాదాలున్నాయి. నిజాం భూములు, ఇనాం భూములు, వార‌స‌త్వం త‌గాదాలు, ప్ర‌భుత్వ స్థ‌లాలు ఇలా కోట్లు ప‌లికే భూములు అమ్మి సొమ్ము చేసుకునేందుకు మాఫియా రెడీగా ఉంటుంది. పోలీస్‌, లాయ‌ర్లు, రాజ‌కీయ‌ నేత‌లు, భూ మాఫియాలో కీల‌క పాత్ర పోషిస్తుంటాయి. ఎవ‌రికి వారు ఒక్క సెటిల్‌మెంట్‌తో రాత్రికి రాత్రి కోట్లు సంపాదించ‌వ‌చ్చ‌ని ఎత్తులు వేస్తుంటారు. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. ఇదే కేసులో సురేష్ న్యాయం చేస్తానని నమ్మ బలికిన ఓ ఎమ్మెల్యే లక్షల రూపాలయను వసూలు చేసినట్టు తెలుస్తోంది. మాట వినకపోడంతో తహిశిల్దారు విజయా రెడ్డిని బెదిరించినట్టు తెలుస్తోంది.

 తారా స్ధాయిలో భూదందా.. ఇష్టాను సారంగా కమీషన్లు..

తారా స్ధాయిలో భూదందా.. ఇష్టాను సారంగా కమీషన్లు..

అంతే కాకుడా కోట్లు ప‌లికే భూమిపై త‌మ‌కూ హ‌క్కుంద‌ని సురేష్ అనే వ్య‌క్తి.. ఓ ఎమ్మెల్యే వ‌ద్ద‌కు వెళ్లాడు. ల‌క్ష‌లు కుమ్మ‌రించాడు. ప‌ని జరగక‌పోవ‌టం వ‌ల్ల ఎమ్మెల్యే తానే స్వ‌యంగా త‌హ‌సీల్దార్‌కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె త‌న‌ను అక్క‌డ నుంచి బ‌దిలీ చేయ‌ట‌మంటూ రంగా రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ను కోరింది. ఇదీ ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారం. కానీ దీని వెనుక‌ అస‌లు సూత్ర‌దారులెవ‌రు..? విజ‌యారెడ్డిని పావుగా వాడుకుని లాభ‌ప‌డిందెవ‌రు..? అనేది కూడా స‌స్పెన్స్‌గా మారింది. అధికశాతం మ‌హిళా ఉద్యోగులు, అధికారుల వెనుక కుటుంబ స‌భ్యులు, ముఖ్యంగా భర్తలు ఉంటారు. అంతా తామై చ‌క్రం తిప్పుతుంటారు. విజయారెడ్డి అంశంలో కూడా ఇదే జరిగినట్టు తెలుస్తోంది.

 ఒంటరైన పిల్లలు.. అమ్మ వస్తుందా అని తండ్రిని ప్రశ్నిస్తున్న చిన్నారులు..

ఒంటరైన పిల్లలు.. అమ్మ వస్తుందా అని తండ్రిని ప్రశ్నిస్తున్న చిన్నారులు..

దాంతో పాటు ఏ సెటిల్‌మెంట్ జ‌ర‌గాల‌న్నా, సంత‌కం చేయించాల‌న్నా, వారే ఆమెతో న‌డిపిస్తారు. ఎంత నిజాయ‌తీగా ప‌నిచేయాల‌ని వారు భావించినా, వారి కుటుంభ సభ్యుల వ్యవహారంతో అవినీతి మ‌రకలు అంటించుకోవాల్సిందే. విజ‌యారెడ్డి కేసులోనూ సొంత భర్తే రింగ్ మాస్టర్ గా మారాడ‌ని తెలుస్తోంది. విలువైన భూమిని కాజేసేందుకు ప్రణాళిక రచించారు. అక్క‌డ‌ మొద‌లైన వివాదం, చివ‌ర‌కు త‌హ‌సీల్దార్‌ను బ‌లి తీసుకుంది. అంత‌వ‌ర‌కూ అయితే ఓకే కానీ, విజ‌యారెడ్డి హత్యతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు అమ్మా అనే పిలుపుకు దూరమయ్యారు.

English summary
The buzz is that Vijayreddy's murder case is a key thorn. The crores worth of lands and the owner of Suresh, who claims to be an MLA, seems to have spent lot of money. It is also said that the MLA has been taken lakhs of rupees from Suresh to do justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X