హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై దుండగులు కాల్పులు జరిపి ఇద్దరు సిబ్బందిని హతమార్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ మృతి చెందారు.

సూర్యాపేట టౌన్ సీఐ మొగలయ్య, హోంగార్డు కిషోర్ బాబు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సూర్యాపేటలో కాల్పులు జరిపింది, బుధవారం మధ్యాహ్నాం సరూర్ నగర్‌లో నాగరాజు అనే జ్యోతిష్యుడిపై కాల్పులు జరిపింది ఒకే ముఠా కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సూర్యాపేటలో ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఇర్ఫాన్‌తో పాటు ఐదుగురు దోపిడీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టు నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగి ఉండచొచ్చని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.

దుండగులను పట్టుకోవడానికి పోలీసులు 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 40 మందితో కూడిన ఆక్టోపస్ కమెండోలను కూడా పంపారు. నల్గొండలో జరిగిన కాల్పుల నేపత్యంలో జిల్లా ఎస్పీ ప్రభాకర్‌ రావుని సస్సెండ్ చేశారు.

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?


నల్లగొండ జిల్లా సూర్యాపేటలో కాల్పులకు తెగబడింది ఇర్ఫాన్ కావచ్చునని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?


కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిఐ మొగిలయ్యను, హోంగార్డు కిశోర్‌ను మరో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆయన గురువారం ఉదయం పరామర్సించారు.

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?


ఇర్ఫాన్‌ను సిఐ మొగిలయ్య 15 రోజుల క్రితం అరెస్టు చేశాడని, అతనే బెయిల్‌పై విడుదలై ఈ కాల్పులకు తెగబడి ఉండవచ్చునని నాయని అన్నారు.

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సంఘటనా స్థలంలో ఒడిషాకు చెందిన ఐడి కార్డు కనిపించినట్లు సమాచారం. దర్యాప్తును తప్పుదారి పట్టించడానికే దాన్ని అక్కడ వదిలి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?


గాయపడిన మొగిలయ్య శరీరంలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు కిమ్స్ వైద్యులు చెప్పారు. మొగిలయ్యకు శస్త్ర చికిత్స అవసరమని వారు చెప్పారు. గాయపడిన కిశోర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు చెప్పారు.

 సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?


కాగా, గాయపడినవారి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి నాయని చెప్పారు. మరణించిన కానిస్టేబుల్స్ కుటుంబాలకు 40 రూపాయలేసి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

గాయపడిన కానిస్టేబుల్‌కు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు. సంఘవిద్రోహ శక్తులను ఎదుర్కోవడంలో పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశంసించారు.

 సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?

సూర్యాపేట కాల్పులు: ఒక ముఠా పనేనా?


నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండులో బుధవారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే. సంఘటన జరిగిన హైటెక్ బస్టాండ్‌ను రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ పరిశీలిస్తున్నారు.

English summary
Telangana DGP Anurag Sharma says that the shootout at Suryapet could be the handiwork of either the Bihar or UP or Odisha interstate robbers’ gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X